Begin typing your search above and press return to search.

కరోనా అప్టేడ్: 15వేల మరణాలు, 63వేల కేసులు

By:  Tupaki Desk   |   24 March 2020 5:31 AM GMT
కరోనా అప్టేడ్: 15వేల మరణాలు, 63వేల కేసులు
X
కరోనా వైరస్ పుట్టిన చైనా దేశంలో దాదాపు దాని తీవ్రత తగ్గు ముఖం పట్టింది. కానీ చైనా నుంచి పరాయి దేశాలకు పాకిన ఈ మహమ్మారి అక్కడ విశృంఖంగా వ్యాపిస్తోంది. వేల మందిని కబళిస్తోంది.

ఇటలీ దేశంలో సోమవారం నాటికి 6000 మరణాలు సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా 15000 కన్నా ఎక్కువగా మరణాలు చోటుచేసుకున్నాయి. కరోనా కారణంగా ఇటలీలో మరణమృదంగం వినిపిస్తూనే ఉంది. 4800 కొత్త కేసులు ఇటలీలో నమోదుకాగా.. సోమవారం ఒక్కరోజే 602 మరణాలు సంభవించాయి. ఇటలీలో మొత్తం కేసుల సంఖ్య ఏకంగా 63000కు చేరాయి..

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి వెలువడ్డ సమాచారం ప్రకారం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 350536 కేసులు నమోదయ్యాయి. యూరప్, ఉత్తర అమెరికా మొత్తం కరోనా విస్తరించింది.

ఇక దక్షిణ కొరియా, సింగపూర్ ఇప్పటివరకు లాక్ డౌన్ లేకుండా వ్యాప్తిని నియంత్రించడానికి వైద్యసేవలు ప్రారంభించాయి. అక్కడ కరోనా నియంత్రణలోకి వచ్చేసింది. కొత్తగా సౌత్ కొరియాలో 64 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8961కు చేరుకున్నాయి.

ఇక భారత దేశంలో ఒకేరోజులో 390 నుంచి ఏకంగా 471కి కరోనా కేసులు పెరిగాయి. భారత దేశంలో 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్ ప్రకటించాయి. భారత్ తోపాటు, అమెరికాలో జనాభా, జనసాంద్రత ఎక్కువ కావడంతో కరోనా నియంత్రణకు కరోనా తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. కఠినమైన లాక్ డౌన్ అమలు చేయడం ద్వారా చైనా కూడా ఐదు రోజులలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఒకే రోజులో 100 మంది మరణించారు. ఇప్పటి వరకు 520 మరణాలు సంభవించాయి. న్యూయార్క్ లోనే 157 మంది మరనించారు.

ఇటలీ, స్పెయిన్ దేశాల్లో రోగులు ఎక్కువై.. ఆస్పత్రులు ఖాళీ లేక ఇంటిలోనే చికిత్స చేస్తున్న పరిస్థితి నెలకొంది. చైనాలో 39 కొత్త కేసులు నమోదయ్యాయి. వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే.. 9 మరణాలు సంభవించాయి.

బ్రిటన్ దేశం కరోనా వైరస్ పై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు వైద్య పరికరాలను పంపిణీ చేయడానికి సైన్యాన్ని వినియోగిస్తోంది. బ్రిటన్ లో 5748 కేసులు.. 282 మంది మరణించారు.

ఇక కెనెడా దేశంలో ఇంట్లో నుంచేపనిచేయాలని.. బయటకు రావద్దని.. అందరూ ఇల్లకు వెళ్లాలని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి కోరారు. కెనడాలో ఇప్పటివరకు 1432 కేసులు.. 20 మరణాలు చోటుచేసుకున్నాయి.