Begin typing your search above and press return to search.

కరోనా తో ఒకే రోజులో 743మంది మృతి ... ఇటలీలో మరణమృదంగం !

By:  Tupaki Desk   |   26 March 2020 6:40 AM GMT
కరోనా తో ఒకే రోజులో 743మంది మృతి ... ఇటలీలో మరణమృదంగం !
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఇటలీలో విజృంభిస్తోంది. కరోనా పుట్టిల్లు చైనాలో కన్నా ఇటలీలొనే ఎక్కువమంది ఈ వైరస్ కు బలయ్యారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే రెండ్రోజులుగా ఇటలీలో కరోనా మరణాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. దీంతో నెమ్మదిగా పరిస్థితి అదుపులోకి వస్తోందని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో మరోసారి కరోనా ఇటలీని ముంచెత్తుతోంది.

గడిచిన 24గంటల్లో ఇక్కడ 743 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. సోమవారం ఈ సంఖ్య 608గా ఉంది. అలానే కరోనా పాజిటివ్ కేసులు కూడా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఇటలీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 69,176. కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితా ఇటలీనే మొదటి స్థానంలో ఉంది. తొలిసారిగా 21 ఏళ్ల యువతి ఈ వైరస్‌ తో ఆస్పత్రి లో చికిత్స పొందుతూ చనిపోయింది. అనారోగ్యం లేకుండా కరోనా బారినపడి మరణించిన అతి పిన్న వయస్కురాలు ఈమెనే అని గుర్తించారు. మరోవైపు యువతకు ఈ వైరస్ సోకితే ఎలాంటి ప్రమాదం లేదని కూడా చెబుతున్నారు.

కానీ అలాంటి నిర్లక్ష్యం వద్దని , ఈ వైరస్ కి ఆడ, మగ, ముసలి అని తేడా లేదు అని , అందరికీ ఈ వైరస్ ఒక్కటే అని , అందుకే... కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి. వైద్యులు, అధికారుల సూచనల్ని తప్పక పాటించండి అని వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఇకపోతే ఇటలీ లో కరోనా పై కొన్ని రోజులుగా పోరాడుతున్న ఏ మాత్రం ప్రయోజనం లేక పోవడంతో కొన్ని ఆరోగ్య సమస్యలతో భాద పడుతున్న ముసలి వారికి కరోనా సోకినా , కరోనా లక్షణాలు ఉన్న కూడా సజీవంగానే ఖననం చేస్తున్నారంట.

అలాగే మరణించిన వారిని కూడా ఒకేసారి ఖననం చేస్తున్నారు. కరోనా తో మరణిస్తే ..కుటుంబ సబ్యులని చివరి చూపులు కూడా దక్కని స్థితిలో ఇటలీ వాసులు ఉన్నారు. ఇంతలా కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది కాబట్టే మన దేశంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని అమల్లోకి తీసుకు వచ్చాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 21 రోజుల పాటు ఇంట్లోనే ఉంటే..ఈ కరోనా ని మనం జయించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ..అత్యవసరం అయితే తప్ప , ఎవరు కూడా తమ ఇంట్లో నుండి బయటకి రావద్దు ....