Begin typing your search above and press return to search.
కరోనా కల్లోలం ... పాజిటివ్ కేసుల్లో అమెరికా , మృతుల్లో ఇటలీ టాప్ !
By: Tupaki Desk | 30 March 2020 11:30 AM GMTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వూహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకు వ్యాపించింది. అమెరికాలో లక్షా 40వేల మందికి పైగా దీని బారిన పడితే.. ఇటలీలో 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సాధారణ ప్రజలతో పాటు డాక్టర్లను కూడా బలి తీసుకుంటోంది. ఇటలీలో ఇప్పటివరకు 50 మంది డాక్టర్లు కరోనాతో చనిపోయినట్లు సమాచారం. కాగా , ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చిన చైనా లో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ..19 దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇప్పటివరకు 185 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందగా .. ముఖ్యంగా 15 దేశాల్లో మాత్రం దీని తీవ్రత ఊహించని స్థాయిలో ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 723,304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో అగ్రరాజ్యం అమెరికాలోనే 142,735 నమోదు కావడంతో.. అక్కడి పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. మృతుల సంఖ్య కూడా 2,488కు చేరింది. అమెరికా పరిస్థితి ఇలా ఉంటే.. ఇటలీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముందు నుండి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, నియంత్రణ చర్యలు పటిష్టంగా లేకపోవడంతో ఇటలీలో కరోనా తీవ్రంగా వ్యాపించింది. ఆ దేశంలో ఇప్పటివరకు 97,689 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి ఏకంగా 10,779 మంది ప్రాణాలు విడిచారు.
మరోవైపు చైనాలో ఈ వైరస్ కారణంగా ఎంతోమంది బలయ్యారు. పాజిటివ్ కేసుల సంఖ్య 81 వేలు కాగా.. 3,300 మంది మృతి చెందారు. వీటితో పాటు స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, యూకేలలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. స్పెయిన్‌లో 80,110 కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 6,803కు చేరింది. అటు జర్మనీలో కేసులు అధికంగా నమోదైనా.. మిగతా దేశాలతో పోలిస్తే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఫ్రాన్స్ – ఇరాన్ – యూకేలు కూడా కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇక ఇండియా లో ఇప్పటివరకు 1,071 పాజిటివ్ కేసులు నమోదు కాగా ..29 మంది మృతి చెందారు.