Begin typing your search above and press return to search.

ఇటలీ డాక్టర్ చెప్పిన కన్నీటి కథ

By:  Tupaki Desk   |   23 April 2020 1:30 AM GMT
ఇటలీ డాక్టర్ చెప్పిన కన్నీటి కథ
X
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇరాన్, ఇటలీలపై మొదట ప్రభావం చూపింది. ఇప్పుడు అమెరికా వంతు వచ్చింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలల్లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. అందులో ఇటలీ దేశంలో మరణ మృదంగం గురించి మొదట చెప్పుకోవాలి. కరోనా దెబ్బకు వృద్ధులంతా ఇటలీలో కొట్టుకుపోయారంటే అతిశయోక్తి కాదు.. వారికి చికిత్స చేయకుండా వదిలేయడంతో ఇటలీలో వృద్ధులంతా మరణించారు. ఒక తరం మొత్తం తుడుచుకుపెట్టుకుపోయిన దైన్యం ఇటలీలో కనిపిస్తోంది.

ప్రపంచంలో ఇప్పటికి కరోనా వైరస్ వల్ల జరిగిన చావులలో ఇటలీ, అమెరికాలోని చావులే సగం ఉన్నాయి. స్మశానంగా మారిన ఇటలీలో ఇప్పటికీ 183957 కరోనా సోకిన రోగులున్నారు.. ఇప్పటివరకు 24648మంది చనిపోయారు. 50వేల మంది కోలుకున్నారు. ప్రతీ 100 మంది రోగులలో 10 మంది చనిపోతున్నారు..ఇటలీలో కరోనా సోకని ప్రాంతం కాగడా పెట్టి వెతికినా దొరకదు.. నగరం, ప్రాంతం, వీధి ఎక్కడ చూస్తే అక్కడ కరోనా విద్వంసం..అయితే ఇటలీలో కొన్ని రోజులుగా కరోనా రోగులు, చనిపోతున్నవారి సంఖ్య తగ్గుతూ కాస్త మార్పు కనిపించింది..

దానికి ఓ కారణం ఉంది. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఆసుపత్రుల్లో పరిస్థితి అదుపు తప్పిన కారణంగా కొత్త రోగుల విషయం, సోకిన వారి వివరాలు అందకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు..ఎందుకంటే ఇటలీలో సంభవించిన మరణాలలో పది శాతం కేవలం డాక్టర్లు వైద్య సిబ్బంది నర్సులే ఉన్నారు..వాస్తవానికి ఇటలీలో వేగంగా పెరిగిన రోగుల సంఖ్యకు కారణం మెడికల్ స్టాఫ్ కు గౌన్లు, గ్లవ్స్ మాస్కులు లభించకపోవడం..అక్కడి డాక్టర్లు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లాభం లేకపోయింది. త్వరగా అన్ని వస్తువులను సరఫరా చేయాలని వారు అడిగి అడిగి విసిగిపోయారు..

ఇటలీలో రోగులకు వైద్యం చేసిన ఓ డాక్టర్ రాసిన లేఖ ఇప్పుడు ప్రపంచానికి ఆ దేశంలో చోటుచేసుకున్న దారుణాలను కళ్లకు కట్టింది. డాక్టర్లు రోగులను రక్షించడానికి పీపీఈ కిట్స్ వేసుకుంటే మళ్లీ డ్యూటీ దిగిపోయే 8 గంటల తర్వాతే తీయాలి. దీంతో వారు మూత్రం పోయకుండా డైపర్లు వేసుకుంటున్న దుస్థితి. డ్యూటీ ఎక్కాక మంచినీళ్లు కూడా తాగడానికి లేదు. ఎందుకంటే తీస్తే కరోనా వైరస్ అంటుతుంది. అందుకే గాలి కూడా పీల్చుకోలేని దుర్భరమైన స్థితిలో ఇటలీ డాక్టర్లు పనిచేశారట.. ఈ విసయాన్ని ఓ వైద్యురాలి లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.

ఆకలి వేస్తున్నా.. దాహం వేస్తున్నా.. ఒంట్లోని శక్తి మింగేస్తున్న సహనంతో కరోనాపై పోరాడామని ఆ డాక్టర్ చెప్పుకొచ్చింది. మాస్కులు, పీపీఈ కిట్స్ తో శ్వాస ఆడకున్నా మాస్క్ తీస్తే కరోనా అంటుంతుందని ఉగ్గబట్టుకున్న దైన్యం డాక్టర్లదని ఆమె రాసుకొచ్చింది.

ఇక ఇటలీలో వైద్యం చేసిన డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది రెండు వారాలకే మారి కొత్త వారస్తున్నారు. అంటే వారికి కూడా కరోనా సోకి ఐసోలేషన్ కు వెళుతున్నారన్న మాట.. ఇంతటి దుర్భర స్థితిలోనూ డాక్టర్లు చేసిన చికిత్స గ్రేట్ అంటూ ఆమె తన లేఖలో రాసుకొచ్చింది.

ఎంతో మంది వృద్ధులు శ్వాస అందక చనిపోవడం చూశామని.. యువకులు ప్రాణాలతో పోరాడడం కళ్లారా చూశామని తన లేఖలో వైద్యురాలు పరిస్థితిని కళ్లకు కట్టింది. 8 గంటల పాటు డ్యూటీలో పీపీఈ కిట్స్ తీయకుండా మూత్రం అందులోనే పోతూ.. దాహం వేసినా నీరు తాగకుండా వైద్యంచేసిన ఇటలీ డాక్టర్ల సేవలపై ఆ వైద్యురాలి లేఖ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.