Begin typing your search above and press return to search.
13 మంది కూరగాయల వ్యాపారులను కాటేసిన కరోనా !
By: Tupaki Desk | 8 May 2020 7:50 AM GMTకరోనా వైరస్ రోజు రోజుకు దేశంలో విస్తరిస్తోంది. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో దీని నుంచి బయటపడేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే కరోనా దేశంలో టెస్టులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ క్రమక్రమంగా కేసులు సంఖ్య పెరుగుతోంది. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రజలతో ఎక్కువగా సంబంధం ఉండే వాళ్లకు కరోనా వైరస్ సోకుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ మధ్య ముఖ్యంగా కూరగాయలు అమ్మే వ్యక్తులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూరగాయలు అమ్మే 13 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ వ్యాపారులకు కరోనా వైరస్.. ఎలా సోకిందన్న దానిని గుర్తించేందుకు పోలీసులు - పలువురు వైద్యాధికారులు రంగంలోకి దిగారు. అలాగే, ఇక వీరు ఎవరెవరికి కూరగాయలు అమ్మారు. వీరితో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు అనే విషయాలను తెలుసుకుంటున్న అధికారులు వారందరినీ క్వారంటైన్ కు తరలించే పనిలో పడ్డారు. అంతేకాదు ఏడుగురు మెడికల్ షాపులో పనిచేసే వ్యక్తులకు కూడా కరోనా సోకడంతో జైపూర్ అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు.
ఇకపోతే , ఈ మద్యే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో 24 - ఆగ్రాలో 28 - లక్నోలో నలుగురు కూరగాయల వ్యాపారులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాలలో కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ వస్తున్న నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న కూరగాయల వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.