Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ నుండి బయటపడ్డ కేరళ ....

By:  Tupaki Desk   |   21 Feb 2020 12:00 PM GMT
కరోనా వైరస్ నుండి బయటపడ్డ కేరళ ....
X
కరోనా వైరస్ ( కోవిడ్ -19 ) చైనా లో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతకరమైన వైరస్ ప్రస్తుతం చైనా తో పాటుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ కోవిడ్ వైరస్ పుట్టిన చైనాలో ఇప్పటికే 2000 మందికి పైగా ఈ వైరస్ ప్రభావంతో చనిపోయారు. చైనా, భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారినపడిన వాళ్ల సంఖ్య సుమారు లక్షకి చేరింది అని సమాచారం. అయితే, ఈ వైరస్ భారిన పడి , కోలుకునే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుండటం మంచి పరిణామం అని చెప్పాలి.

ఇక ఈ కరోనా వైరస్ ..మనదేశంలోని కేరళని వణికించిన విషయం తెలిసిందే. కేరళలో కరోనా పాజిటివ్ కేసులు మూడు నమోదు కావడంతో దేశం మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. అయితే, కరోనా భారిన పడిన వారికీ కేరళ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించి , త్వరగా కరోనా భారీ నుండి బయటపడేలా చేసారు. ఈ వైరస్ భారిన పడిన ముగ్గురికి పలుదపాల్లో రక్తపరీక్షలు చేసి ...కరోనా పూర్తిగా తగ్గి పోయింది అని వైద్యులు తేల్చడంతో ఈ నెల 14న మొదటి వ్యక్తిని డిశ్చార్జి చేసిన డాక్టర్లు.. గురువారం చివరి ఇద్దరిని కూడా ఇళ్లకు పంపేశారు. ఈ మేరకు కేరళ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

చైనాలోని వూహాన్‌లో వివిధ యూనివర్సిటీల్లో చదువుతోన్న భారత విద్యార్థుల్లో కొందరిని ప్రభుత్వమే తరలించగా, ఇంకొందరు తమంతట తామే తిరిగొచ్చేశారు. అలా వచ్చినవాళ్లలో కేరళకు చెందిన ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. ఆ ముగ్గురూ త్రిసూర్, అలెప్పీ, కాసర్ గోడ్ కు చెందినవాళ్లు. అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ముగ్గురికీ చికిత్స అందించింది. తాజాగా ఆ ముగ్గురు కూడా కరోనా భారీ నుండి బయట పడటంతో డీఛార్జ్ చేసారు. కరోనా వైరస్ బాధితులకు 14 రోజుల పాటు చికిత్స అందించామని, పూర్తిగా నయమైందని నిర్ధారించుకున్నాకే డిశ్చార్జి చేశామని, వాళ్ల వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేనప్పటికీ జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటి దగ్గర కూడా మరో 14 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని డాక్టర్ అమర్ ఫెటైల్ తెలిపారు. అయితే , ఇంకా కోవిడ్ 19 కి సరైన వైద్యం లేనప్పటికీ ఉన్న మందుల్ని ఉపయోగించి , కరోనాని పూర్తిగా తగ్గించారు.