Begin typing your search above and press return to search.

కరోనా మహమ్మారికి కృష్ణా జిల్లా అల్లకల్లోలం

By:  Tupaki Desk   |   27 April 2020 7:10 AM GMT
కరోనా మహమ్మారికి కృష్ణా జిల్లా అల్లకల్లోలం
X
కరోనా వైరస్ తో కృష్ణా జిల్లా అతలాకుతలం అవుతోంది. తాజాగా కృష్ణాలో కేసుల సంఖ్య 210కి చేరింది. జిల్లాలో ఆదివారం వరకు 177 కేసులుండగా.. తాజాగా సోమవారం ఉదయం 11 గంటల వరకు మరో 33 కొత్త కేసులు నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 210కి చేరింది. 173 యాక్టివ్ కేసులు ఉండగా 29మంది డిశార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 8మంది కరోనాతో చనిపోయారు.

కాగా ఏపీ వ్యాప్తంగా 24 గంటల్లో 80 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కొత్త కేసుల సంఖ్య 1177కు చేరింది. ఏపీ వ్యాప్తంగా 31మంది మరణించారు.

కృష్ణా జిల్లాలో ఆదివారం నమోదైన 52 కేసుల్లో 45 కేసులు విజయవాడ నగరంలో ఉన్నాయి. తాజాగా విజయవాడ కార్మిక నగర్ లోనే 19మందికి వైరస్ సోకింది. ఒక యువకుడు దుబాయ్ నుంచి వచ్చి క్వారంటైన్ లో ఉండకుండా వ్యాపింపచేశాడు. అతడి ద్వారా 8 మందికి కరోనా వచ్చింది. వీరి ద్వారా 19మందికి కరోనా విస్తరించింది. కృష్ణలంకలో 9మందికి - భ్రమరాంబపురంలో ఒకే కుటుంబంలో నలుగురికి - వీరిలో 4 నెలల చిన్నారి ఉండడం కలకలం రేపుతోంది.

ఇక విజయవాడ గాంధీనగర్ లో ఆరుగురికి కరోనా సోకింది. మధురానగర్ లో 5 - కేదారేశ్వరపేటలో 3, పెనమలూరులో 5, విద్యాధరపురం, యారంవారి వీధి, ఉంగుటూరు మండలం తరిగొప్పుల, అజిత్‌సింగ్‌ నగర్‌లోని గీతామందిర్‌ కాలనీ, సీతారామపురంలలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే రామవరప్పాడులో నివసిస్తున్న ఒక కానిస్టేబుల్‌ కు పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది.

పశ్చిమ బెంగాల్ నుంచి కృష్ణలంకకు వచ్చిన స్థానిక లారీ డ్రైవర్ లాక్ డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి ఇంటి చుట్టు పక్కల వారితో పేకాట - జూదం ఆడి ఏకంగా 20 మందికి కరోనా వైరస్ అంటించాడు. వీరిలో ఒకరు మరణించారు. దీంతో లారీడ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.