Begin typing your search above and press return to search.
కరోనా వైరస్ తో వణికిపోతోన్న కువైట్ ...మొత్తం బంద్ !
By: Tupaki Desk | 12 March 2020 6:27 AM GMTకరోనా వైరస్ దెబ్బకి ప్రపంచంలోని దాదాపు 120 దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందటంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 4,300 మందికి పైగా మృతిచెందారు. ఇందులో అత్యధిక స్థాయిలో చైనాలోనే ఉన్నారు. చైనా తర్వాత అత్యధిక స్థాయిలో కరోనా ప్రభావానికి గురైంది ఇటలీ.. ఇప్పుడు యూరోపియన్ దేశంలో కూడా భారీ సంఖ్యలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి.
ఇక ఈ కరోనా వైరస్ అరబ్ దేశాలకు సైతం పాకింది. పశ్చిమ ఆసియాలోని తూర్పు అరేబియాకు చెందిన గల్ఫ్ రాష్ట్రమైన కువైట్ లో కరోనా వణికిస్తోంది. ఈ కరోనా వైరస్ దెబ్బకు కువైట్ సిటీ అంతర్జాతీయ విమానశ్రయంలో శుక్రవారం నుంచి అన్ని కమర్షియల్ విమానాలని రద్దు చేయనున్నారు. కరోనా భయంతో గల్ఫ్ రాష్ట్రాలను రెండు వారాలపాటు షట్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అలాగే, స్థానిక ఉద్యోగులకు కూడా 14 రోజుల పాటు హాలిడేస్ ప్రకటించింది. కార్గో ఎయిర్ పోర్టు, కువైట్ వాసుల విమానాలకి ఈ నిర్ణయం వర్తించదంటూ విమానాల నిషేధంపై ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
ఇక మార్కెట్లు, కేఫ్ లు, హెల్త్ క్లబులపై కూడా నిషేధం విధించారు. గల్ఫ్ దేశంలో కరోనా కేసులు 72 వరకు నమోదు కావడంతో వైరస్ తీవ్రత పెరగకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలను ఆ దేశ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇకపోతే ఖతార్ లో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 262కు పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒకే రోజు లో 238 కొత్త కేసులు నమోదైనట్టు తెలిపింది.