Begin typing your search above and press return to search.

కరోనా ఎఫైర్స్ : పోలీసుల ట్రాకింగ్ లో నమ్మలేని నిజాలు

By:  Tupaki Desk   |   5 May 2020 12:30 AM GMT
కరోనా ఎఫైర్స్ : పోలీసుల ట్రాకింగ్ లో నమ్మలేని నిజాలు
X
కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. మధ్యప్రదేశ్ లో అయితే ఎటు నుంచి ఎవరికి వైరస్ వ్యాపిస్తుందో అంతుబట్టడం లేదట..తాజాగా కరోనా వైరస్ వ్యాప్తికి మధ్యప్రదేశ్ లో అక్రమ సంబంధాలు కారణమని పోలీసులు కనిపెట్టారు. ఇందులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

రోగుల సెల్ ఫోన్ ట్రాకింగ్ చేసినప్పుడు వెలుగుచూసిన అక్రమ సంబంధాల చైన్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పోలీసులను మైండ్ బ్లాక్ చేసేసిందట.. మధ్యప్రదేశ్ లో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికే కరోనా ఎక్కువగా సోకిందని.. వారే వ్యాప్తికి కారణమని పోలీసులు తేల్చారు. కరోనా సోకిన ఓ బాధితురాలి ఫోన్ ట్రాక్ చేసినప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయట..

ఇప్పటికే బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ద్వారా మధ్యప్రదేశ్ లో చాలా మందికి కరోనా సోకిన విషయం బయటపడింది. తాజాగా భోపాల్ లోని ఓ ప్రాంతంలో విచిత్రమైన కేసును పోలీసులు ఛేదించారు. ఆఫీసుకెళ్లే వ్యక్తికి కరోనా సోకింది. ఆ వీధిలో ఇంట్లో ఆఫీసులో చెక్ చేయగా ఎవరికి లేదు. మరి ఎలా వచ్చిందని ఆరాతీస్తే అతడికి సెకండ్ సెటప్ ఉందని. ఆమె ద్వారానే సోకిందని తేలింది. ఇద్దరికీ పాజిటివ్ గా తేలింది.

కరోనా వైరస్ చైన్ ను కనిపెట్టడానికి పోలీసులు వారి కాంటాక్టుల కాల్ డేటాను తీసి ట్రాకింగ్ చేస్తున్నారు. దీంతో వారి అక్రమ సంబంధాలు ఇలా బయటపడుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారంతా ఇప్పుడు అవి బయటపడి పరువు తీసుకుంటున్నారు. కరోనా వల్ల ఈ ఎఫైర్స్ గోల మధ్యప్రదేశ్ లో బాగా రచ్చరచ్చ అవుతోందట..