Begin typing your search above and press return to search.

రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో కరోనా కలకలం ... గాంధీ నుండి పారిపోయి ...

By:  Tupaki Desk   |   21 March 2020 10:44 AM GMT
రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో కరోనా కలకలం ... గాంధీ నుండి పారిపోయి ...
X
ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. మృతుల సంఖ్య 11,417కి చేరింది. గంటగంటకూ అది విపరీతంగా పెరిగిపోతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 276462 మందికి కరోనా వైరస్ సోకగా ,ఇప్పటివరకూ 91954 మంది వైరస్ నుంచీ కోలుకున్నారు. ఇక భారత్ లో కూడా ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఇండియా లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300 కి చెరువు అవుతుండటం తో దేశ ప్రజానీకం మొత్తం తీవ్రమైన భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే , తెలంగాణ లో కూడా కరోనా భయం అంతకంతకు పెరిగిపోతుంది. వైరస్ విస్తరించకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల్లో ఉన్న అవగాహన లోపం కనిపిస్తోంది. వైరస్ లక్షణాలున్న వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ పలువురు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా..ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్న ఇద్దరు దంపతులు రైలులో ప్రయాణం చేస్తున్నారనే వార్త తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన వరంగల్ జిల్లాల్లో చోటు చేసుకుంది.

వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా రాజధాని ఎక్స్ ప్రెస్ 2020, మార్చి 21వ తేదీ శనివారం వెళుతోంది. బీ 3 బోగీలో ఉన్న దంపతులను టీసీ గుర్తించారు. వీరి చేతుల మీదు ఐసోలేషన్‌ లో చికిత్స చేసినట్లుగా గుర్తించే ముద్ర ఉంది. దీనిని టీసీ గమనించి..ప్రశ్నించారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో పై అధికారులకు విషయాన్ని తెలియచేశారు. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ కు చేరుకొని, వారిని అదుపులోకి తీసుకున్నారు. 108 వాహనం ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు.

దీనితో బీ 3 బోగీలో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వైద్యాధికారులు అక్కడకు చేరుకుని రసాయనాలు చల్లారు. ఆ ప్రాంతమంతా శానిటైజర్ స్ప్రే చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఈ దంపతులను స్క్రీనింగ్ టెస్టులు చేశారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆసుపత్రిలోని గాంధీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే , ఐసోలేషన్ లో ఉండాల్సిన వారిద్దరూ ఒక్కసారిగా రాజధాని ఎక్స్ ప్రెస్‌ లో ప్రత్యక్షం అవ్వడం కలకలం రేపింది.