Begin typing your search above and press return to search.

కరోనాను జయించిన రాజమండ్రి యువకుడు!

By:  Tupaki Desk   |   3 April 2020 6:10 AM GMT
కరోనాను జయించిన రాజమండ్రి యువకుడు!
X
కరోనా వైరస్ ...ఈ మహమ్మారి వల్ల ప్రస్తుతం ప్రపంచం మొత్తం గజగజవణికిపోతుంది. ఈ కరోనా వైరస్ ఇండియాలోని తెలుగు రాష్ట్రాలని కూడా వణికిపోయేలా చేస్తుంది. తాజాగా ఏపీలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం తో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇకపోతే ఏపీలో నేటి ఉదయం 10 గంటల వరకు ... 161 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు - నెల్లూరు - కృష్ణా జిల్లాలో అత్యధిక కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తబ్లిగి జమాత్ కారణంగా కేసులు అధికమయ్యాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న క్రమంలోనే జిల్లాల కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇకపోతే , తాజాగా ఏపీలో కరోనా సోకిన యువకుడు ..కరోనా పై పోరాటం చేసి , విజయం సాధించి హాస్పిటల్ నుండి డీఛార్జ్ అయ్యాడు. రాజమండ్రికి చెందిన ఆ యువకుడు ఇటీవలే విదేశాల నుండి వచ్చాడు. కరోనా ను జయించి , డీఛార్జ్ అయిన తరువాత ..ఆ యువకుడు మాట్లాడుతూ .... నేను దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలోనే ఇండియాకి తిరిగివచ్చానని , ఆ తరువాత తన స్నేహితుడు , విమానంలో పక్క ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది అని తెలియగానే , అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్ కి వచ్చానని తెలిపారు. అక్కడ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించి ..ఒక రోజు తరువాత నాకు కరోనా సోకినట్టు డాక్టర్లు నిర్దారించారు అని తెలిపాడు. దీనితో వెంటనే డాక్టర్ల సలహా మేరకు , కరోనా చికిత్స కోసం హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని , ఆ తరువాత నన్ను డాక్టర్స్ , వైద్య సిబ్బంది అందరూ చాలా బాగా ట్రీట్ చేసారు అని చెప్పుకొచ్చాడు.

కరోనా కి ఒక వారం రోజుల పాటు మందులు అన్ని వాడిన తరువాత , నువ్వు కోలుకుంటున్నావ్ ..భయంలేదు అని డాక్టర్స్ నాకు దైర్యం ఇచ్చారని తెలిపారు. అలాగే , నాకు కరోనా సోకింది అని తెలియగానే ..నా కుటుంబ సభ్యులని కూడా కరోనా నిర్దారణ పరీక్షల కోసం హాస్పిటల్ కి తీసుకు వచ్చి , వారికీ కరోనా పరీక్షలు రెండు సార్లు చేసిన తరువాత కరోనా నెగటివ్ రావడం తో వారిని ఇంటికి పంపించారు అని , ఇక నేను హాస్పిటల్ లో జాయిన్ అయ్యి 14 రోజులు అవుతుంది. దీనితో నాకు ప్రతి రోజు కూడా బ్లడ్ టెస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా నెగటివ్ అని రాగానే ..మరోసారి కూడా కంఫార్మ్ చేసుకొని కరోనా నెగటివ్ అని తేలడంతో నన్ను డీఛార్జ్ చేస్తున్నారు అని తెలిపాడు. అలాగే ఎవరికైనా కరోనా సోకినట్టు అనుమానం ఉంటే వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి కరోనా టెస్ట్ చేపించుకోవాలని , లేకపోతే మన కుటుంబ సభ్యులతో పాటుగా మన పక్కవారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది అని , దైర్యం ముందుకు వచ్చి కరోనాను జయిద్దాం అని చెప్పుకొచ్చాడు.