Begin typing your search above and press return to search.

అ దేశంలో 5 వేల మంది భారతీయులకి కరోనా పాజిటివ్ !

By:  Tupaki Desk   |   5 May 2020 5:30 PM GMT
అ దేశంలో  5 వేల మంది భారతీయులకి  కరోనా పాజిటివ్ !
X
ప్ర‌పంచ దేశాల్లో కరోనా వైరస్ మ‌హ‌మ్మారి విల‌య తాండ‌వం చేస్తోంది. అగ్ర‌రాజ్యం అమెరికా స‌హా అన్ని దేశాలు క‌రోనా ధాటికి ఉక్కిరిబిక్కిర‌వుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.60 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 2.52 లక్షలు దాటింది. ఈ తరుణంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల ప‌రిస్థితి ద‌యానీయంగా మారింది. తాజాగా, సింగ‌పూర్ ‌లో సుమారుగా 5,000 మంది భారతీయులు క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డిన‌ట్లు స‌మాచారం.

గత కొన్ని రోజులుగా సింగ‌పూర్‌ లో క‌రోనా విజృంభ‌ణ కొనసాగుతుంది. అక్కడ కూడా కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు . దీనితో అక్కడ ఉన్న విద్యార్థులతో సహా 3,500మందికిపైగా భారతీయులు స్వదేశానికి తిరిగి రావడానికి, వసతి, ఆహారం సహాయం కోసం భారత హైకమిషన్‌లో నమోదు చేసుకున్నారు. సుమారు 5వేల మంది కరోనా పాజిటివ్‌ వచ్చిన భారత పౌరులు ఉండగా వీరిలో ఎక్కువ మంది విదేశీ కార్మికుల వసతి గృహాల్లో నివసిస్తున్నారు.

ఏప్రిల్‌ చివరి వరకు కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు భారత హై కమిషనర్‌ తెలిపారు. సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కరోనా పాజిటివ్‌ కేసులు 18,205నమోదయ్యా యి. 18మరణాలు సంభవించాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయితే భారతీయ కార్మికుల్లో దాదాపు అందరికీ స్వల్పస్థాయిలో లక్షణాలు ఉన్నాయని వారి పరిస్థితి మెరుగుపడుతోందని సింగపూర్‌ భారత్‌ హైకమిషనర్‌ జావేద్‌ అష్రాఫ్‌ మీడియాకు వెల్ల‌డించారు.