Begin typing your search above and press return to search.
కొవిడ్ ఎఫెక్ట్.. ఆ దేశంలో పలకరింపు ముద్దుకు చెక్
By: Tupaki Desk | 2 March 2020 9:45 AM GMTమనం బాగున్నాం. మన పక్కనోడు ఎలా ఉంటే మనకెందుకు? అన్న ఐడియాలజీ మీకుందా? అయితే.. వెంటనే మార్చేసుకోవాల్సిందే. ఎందుకంటారా? అలాంటి ఆలోచన ప్రపంచానికే ముప్పు అన్న విషయం కొవిడ్ 19 క్లియర్ గా చెప్పేసిందని చెప్పాలి. నా దారిన నేను పోతా.. పక్కనోడ్ని పట్టించుకోనంటే.. ఏదో ఒక రోజు అదే నీకు శాపమవుతుందన్న విషయాన్ని చైనా ఉదంతం ఇప్పుడు ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా చెప్పేసిందని చెప్పాలి.
చైనాలో కొవిడ్ వైరస్ వెలుగు చూసినప్పుడు.. మనకేం సంబంధం అన్నట్లుగా కొన్ని దేశాలు వ్యవహరిస్తే.. మరికొన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇంకొన్ని దేశాలు మాత్రం ఈ పిశాచితో ప్రపంచానికే ప్రమాదమని ఆందోళన చెందారు. అలాంటి వారి అనుమానం నిజమైంది. చైనాలో ఎక్కడో వూహాన్ ప్రావిన్స్ లో మొదలైన కొవిడ్ కలకలం అంతకంతకూ పెరిగి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు వ్యాపించింది.
మొన్నటివరకూ ఈ వైరస్ గురించి పెద్దగా పట్టని వారు సైతం.. ఇప్పుడీ వైరస్ మాట విన్నంతనే ఉలిక్కి పడుతున్నారు. క్యాలెండర్లో రోజులు గడుస్తున్నా.. ఈ వైరస్ కు చెక్ పెట్టే పరిస్థితి లేకపోవటంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. కొవిడ్ దెబ్బతో కొత్త నిబంధనల్ని తీసుకొస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన దేశంగా అభివర్ణించే స్విట్జర్లాండ్ లో ప్రజలు ఒకరినొకరు పలకరించుకోవటానికి ఒకరికొకరు దగ్గరగా వెళ్లి ముద్దు పెట్టుకుంటారు. స్విస్ సంప్రదాయానికి కొవిడ్ దెబ్బేసేలా ఉంది.
ఇప్పుడా దేశంలో స్త్రీ.. పురుషులు పరస్పరం ముద్దులతో పలకరించే విధానానికి స్వస్తి చెప్పేందుకు వీలుగా కొత్త రూల్ ను తేవాలన్న ఆలోచనలో ఆ దేశం ఉంది. ఈ సంప్రదాయం కొవిడ్ మహ్మమారి దేశంలో వ్యాప్తి చెందేందుకు వీలుండటంతో.. వెంటనే దీన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని స్విస్ సర్కారు ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. ఆ దేశ ఆరోగ్య శాఖామంత్రి కొత్త సలహాను దేశ ప్రజలకు ఇచ్చారు. ముద్దు పలకరింపు కొంతకాలం పాటు స్వస్తి చెప్పి.. దూరంగా ఉండాలని చెప్పటం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో కొవిడ్ మరెన్ని మార్పుల్ని తీసుకొస్తుందో?