Begin typing your search above and press return to search.
రోటీన్ కు భిన్నంగా తమిళనాడు లో కరోనా సీన్
By: Tupaki Desk | 29 April 2020 4:45 AM GMTఅందరి కంటే ముందే కళ్లు తెరిచాం. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించామన్న మాట గొప్పలు చెప్పుకుంటున్న వేళ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒక పట్టాన మింగుడుపడటం లేదు. లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా కట్టడి కావాల్సింది పోయి.. రోజులు గడిచే కొద్దీ కేసుల సంఖ్య అంతకంతకూపెరుగుతోంది. అంతేకాదు.. రోటీన్ కు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనాఎంట్రీ ఆలస్యమైనా.. తమిళనాడులో వైరస్ వ్యాప్తి మాత్రం వేగంగా సాగుతోంది.
ఆ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్ని విశ్లేషిస్తే.. షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో చూస్తే.. చిన్నారులకు కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదైనట్లు చెబుతున్నారు. ఇందుకు భిన్నంగా తమిళనాడులో మాత్రం పన్నెండేళ్ల లోపు పిల్లలకు కొవిడ్ 19 సోకటం ఆశ్చర్యకరంగా మారింది. సాధారణంగా చిన్న పిల్లల్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తక్కువగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.
అందుకు భిన్నంగా తమిళనాడులో మాత్రం పిల్లల్లో కరోనా కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా జరిపిన అధ్యయనం లో 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లల్లో 121 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. తమిళనాడులో 2058 కేసులు నమోదు కాగా.. అందులో ఆరు శాతం కేసులు చిన్నారులే కావటం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే.. తమిళనాట కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
రాష్ట్ర రాజధాని చెన్నైలోనూ కరోనా విరుచుకుపడుతోంది. ఇప్పటివరకూ ఆ మహానగరంలో 673 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 103 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో కృష్ణగిరి జిల్లా తప్పించి మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కరోనా కలకలంతో ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు.