Begin typing your search above and press return to search.
కరోనాను జయించిన యువకుడికి వైద్యులేం చెప్పారు?
By: Tupaki Desk | 14 March 2020 5:30 AM GMTదాదాపు పద్నాలుగు రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యం చేసిన కరోనా బారిన పడిన యువకుడ్ని శుక్రవారం రాత్రి గాంధీ వైద్యులు డిశ్చార్జ్ చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా అతడికి వైద్యులు ఏం చెప్పారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
కోవిడ్ జయించిన సదరు యువకుడు మరో పదిహేను రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇంట్లో ఐసోలేషన్ గదిని సిద్ధం చేసి.. అందులో ఉంచాలన్న సూచనలు చేశారు. అదే సమయంలో బాధిత యువకుడి కుటుంబ సభ్యులకు గతంలోనే కరోనా పరీక్షలు చేయగా.. వారందరికి నెగిటివ్ వచ్చింది. ఈ నేపథ్యం లో బాధితుడి విషయంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు చెప్పారు.
కొన్ని మందుల్ని ఇచ్చినట్లుగా తెలిసిందే. కరోనాతో ఎలాంటి ప్రభావం లేదని.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే మరో పదిహేను రోజులు ఇంట్లోనే ఉండాలని.. బయటకు రావొద్దని చెప్పారు. ఇదిలా ఉంటే.. కరోనా పాజిటివ్ కేసుకు వైద్యం చేసి.. అతడిలోని వైరస్ ను జయించేలా చేసిన వైద్యులు.. గాంధీలోని ప్రత్యేక వార్డులో ప్యుమిగేషన్ ను నిర్వహించారు. వైరస్.. బ్యాక్టీరియా లేకుండా వార్డుల్లో గోడలు.. మంచాయిలు.. పరుపులు.. ఇతర పరికరాల్ని ప్రత్యేక ద్రావణాలతో శుభ్రం చేశారు.