Begin typing your search above and press return to search.
కేసీఆర్ సారూ.. కేరళ చేస్తున్న పని చూస్తున్నారా?
By: Tupaki Desk | 30 April 2020 5:20 AM GMTదేశంలోని చాలా రాష్ట్రాలు కరోనా బారిన పడటం తెలిసిందే. ఉప్పెనలా విరుచుకుపడ్డ కరోనా పాజిటివ్ కేసులతో చాలా రాష్ట్రాల మాదిరే కేరళ సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. దేశంలో తొలి కరోనా కేసు కేరళలోనే నమోదైన మరక తనకు అంటినా.. తనదైన పద్దతుల్ని అనుసరించటం ద్వారా.. కరోనాను కంట్రోల్ చేయటంలో మాత్రం మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా నిలిచింది. అంతేకాదు.. కరోనా మరణాల్ని నిరోధించటంలోనూ తన సత్తాను కేరళ రాష్ట్రం ప్రదర్శించింది. పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలచింది.
మేధావి ముఖ్యమంత్రిగా తనకు తాను ఇమేజ్ బిల్డప్ చేసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం.. ఒక టీంను కేరళకు పంపి.. అక్కడ అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని.. రాష్ట్రంలోనూ అమలు చేయాలని చెప్పటం మర్చిపోలేం. ఇదిలా ఉంటే.. తాజాగా కేరళలో కరోనా సమూహ వ్యాప్తి జరిగిందా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సెంటినల్ సర్వీలియన్స్ విధానాన్ని స్టార్ట్ చేసింది. పంచాయితీ స్థాయిలో వివిధ వర్గాల ప్రజల నుంచి నమూనాల్ని సేకరించి.. ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై అధ్యయనాన్ని స్టార్ట్ చేసింది.
ఇలా చేసిన విధానంలో ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ విధానంలో శాంపిల్స్ సేకరించిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావటం.. అందులో ఒకరు ఆరోగ్య సిబ్బంది కావటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న పద్నాలుగు జిల్లాల్లో నమూనాల్ని సేకరిస్తున్నారు. కరోనాను సమర్థంగా అడ్డుకున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. అయితే.. తాజాగా పాజిటివ్ గా నమోదైన పాతిక కేసులు ఇప్పుడా రాష్ట్రానికి తలనొప్పిగా మారాయి.
పాతిక పాజిటివ్ కేసులకు కరోనా వైరస్ ఎక్కడ నుంచి వ్యాప్తి చెందిందన్న సమాచారం ఒక పట్టాన తేలని పరిస్థితి. దీంతో.. రాష్ట్రంలో సమూహ వ్యాప్తి స్టార్ట్ అయ్యిందా? అన్నది సందేహంగా మారింది. అయితే.. ఈ వాదనను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. పరిస్థితి అదుపులో ఉన్నట్లు చెబుతున్నా.. అలాంటిదేమీ లేదన్న మాట పలువురు అధికారులు లోగుట్టుగా వ్యాఖ్యానిస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సర్వీలియెన్స్ విధానంలో భాగంగా ఏప్రిల్ 26 నాటికి మూడువేలకు పైగా నమూనాల్ని సేకరించి.. పరీక్షలు జరిపారు. ఈ శాంపిల్స్ తీసుకునే విధానంలో విదేశాల నుంచి వచ్చిన వారే కాదు.. ప్రైమరీ కాంటాక్టులు.. సెకండరీ కాంటాక్టులు.. పెద్దవయస్కులు.. రెండు మూడు వ్యాధులు ఉన్న వారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. గర్భిణులు.. షాపుల వారు.. ఆరోగ్య సిబ్బంది తో పాటు.. అధిక రిస్కు ఉన్న వారి నుంచి నమూనాలు సేకరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇలాంటి పరీక్షలకు కేసీఆర్ మాత్రం ససేమిరా అంటున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ లో కరోనా నిర్దారణ పరీక్షలు చాలా తక్కువగా చేశారు. అదేమంటే.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం చేసినట్లుగా చెబుతున్నారు. గడిచిన ఐదారు రోజులుగా సింగిల్ డిజిట్ లో కరోనా కేసులు తెలంగాణలో వెలుగు చూస్తున్నాయి. పాజిటివ్ గా నమోదైన కేసుల అంకెలు తగ్గిపోయిన వేళ.. తెలంగాణలో పరిస్థితి మెరుగుపడినట్లుగా భావిస్తున్నారు. ఇలాంటివేళ.. కేరళ తరహాలో నమూనాల్ని సేకరించి.. అధ్యయనం చేస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ర్యాపిడ్ టెస్టులతో పాటు.. ఇతరత్రా పరీక్షల విషయంలో కేసీఆర్ సర్కారు సిద్ధంగా లేదన్న సంగతి తెలిసిందే. కరోనా విషయంలో తాను అధ్యయనం చేయించిన రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాల్ని కేసీఆర్ సారు ఒకసారి తెలుసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.