Begin typing your search above and press return to search.

కరోనా కల్లోలం..మూడు రోజుల వ్యవధిలో తండ్రి - కొడుకు మృతి!

By:  Tupaki Desk   |   2 May 2020 4:30 PM GMT
కరోనా కల్లోలం..మూడు రోజుల వ్యవధిలో తండ్రి - కొడుకు మృతి!
X
కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకు మూడు రోజుల వ్యవధిలో మృతిచెందారు. ఈ విషాధ ఘటన వనస్థలిపురంలో జరిగింది. కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకగా.. వృద్ధుడైన తండ్రి ఇటీవలే ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. శుక్రవారం సాయంత్రం ఆయన కుమారుడు కూడా కరోనాతో మరణించాడు. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మలక్‌‌పేట గంజిలో నూనె వ్యాపారం చేసే వ్యక్తికి జ్వరం రావడంతో.. వనస్థలిపురం ఏ-క్వార్టర్స్‌ లో నివాసం ఉండే తన సోదరుడికి ఇంటికి వెళ్లాడు. అతడి సాయంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందాడు. కానీ అతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో గాంధీ హాస్పిటల్‌కు పంపి చికిత్స అందిస్తున్నారు. ఈలోగానే ఆ ఇంట్లోని వృద్ధుడికి కరోనా సోకింది. ఆయనకు బీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. హాస్పిటల్ ‌లో చేర్పించిన 24 గంటల్లోనే ఆయన చనిపోయారు.

మరణించిన తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. తాజాగా ఆయన రెండో కుమారుడు కూడా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.కుటుంబం లోని మిగతా వారికి కూడా కరోనా సోకడం తో వారంతా క్వారంటైన్లో ఉన్నారు. ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా అని తేలడం, ఇద్దరు చనిపోవడం తో.. అధికారులు వీరు ఉంటున్న ప్రాంతాన్ని కంటైన్ ‌మెంట్ జోన్‌ గా ప్రకటించారు.