Begin typing your search above and press return to search.
కరోనా కేసుల్లో కొత్త కోణం: అక్రమ సంబంధమే కారణమంట
By: Tupaki Desk | 4 May 2020 3:45 AM GMTతెలంగాణలో కరోనా కేసులు వినూత్నంగా సోకుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఆ క్రమంలోనే ఓ జిల్లా కేంద్రంలో అనూహ్యంగా కరోనా కేసులు భారీగా నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఓ మహిళ అష్టాచెమ్మా ఆడడమేనని ఇప్పటివరకు తెలిసింది. అది వాస్తవమే అయినా ఆమెకు ఎవరి ద్వార కరోనా సోకిందని విచారణ చేయగా ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రధాన పట్టణంలో భారీగా కేసులు నమోదు కావడానికి ఒక అక్రమ సంబంధం అని తేలింది. దీంతో అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
పోలీసులు సేకరించిన నివేదికలో ఈ విధంగా ఉంది. ఆ పట్టణంలో ఉన్న మెడికల్ దుకాణానికి మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తి వచ్చాడు. అతడు మందులు కొనుగోలు చేయగా అతడి నుంచి మెడికల్ దుకాణం వ్యక్తికి కరోనా సోకింది. ఈ విషయం తెలియని అతడు యథావిధిగా పనులు చేసుకుంటున్నాడు. అయితే అతడికి తన దుకాణం పక్కన ఉన్న ఓ కిరాణం దుకాణం మహిళతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో అతడు ఆమెతో చనువుగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడి ద్వారా ఆమెకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కిరాణ దుకాణం మహిళతో చేపలు విక్రయించే మహిళ ముచ్చట్లు పెట్టి ఆమెతో స్నేహంగా ఉంది. ఇక చేపలు విక్రయించే మహిళకు కూడా కరోనా పాకింది.
ఆ చేపలు విక్రయించే మహిళ సాధారణంగా అష్టాచెమ్మా ఆడుతుంది. లాక్‌డౌన్ వేళ పని లేకపోవడంతో మార్కెట్ ప్రాంతంలో పలువురితో అష్టాచెమ్మ ఆడింది. దీంతో ఆమెతో అష్టాచెమ్మా ఆడిన వారందరికీ కరోనా పాజిటివ్ రావడం తో ఒక్కసారిగా ఆ పట్టణంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఈ విధంగా ఒక అక్రమ సంబంధం ద్వారా ఆ పట్టణమంతా భారీగా కరోనా కేసులు నమోదు కావడం విస్తుగొల్పుతోంది. ఈ వార్త తెలిసి ప్రజలందరూ షాక్ కు గురవుతున్నారు.