Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు దిమ్మ తిరిగే టాస్క్ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్
By: Tupaki Desk | 4 May 2020 5:00 AM GMTసంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ప్రజల కోసం.. వారి బాగు కోసం అనునిత్యం తపిస్తున్నట్లుగా ఆయన మాటలు ఉండటాన్ని మర్చిపోలేం. తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా.. దేనికైనా సిద్ధమన్నట్లుగా ఉండే ఆయన మాటలకు తగ్గట్లే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ టాస్కు ఇవ్వటం గమనార్హం.
ముల్లును ముల్లుతోనే తీయాలనే నానుడికి తగ్గట్లే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇరుకున పడేసేలా ఓపెన్ లెటర్ రాశారు టీ కాంగ్రెస్ నేతలు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల్ని క్షేమంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. లాక్ డౌన్ అమలులో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల పరిస్థితి దుర్భరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు 85 లక్షల మంది ఉంటే.. వారిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలే 15 లక్షలని చెబుతున్నారు. కరోనా కారణంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన మూడున్నర లక్షల వారి పరిస్థితి దారుణంగా మారిందని చెబుతున్నారు. లాక్ డౌన్ తో వారు తీవ్రంగా నష్ట పోయారని.. అందుకే వారిని స్వరాష్ట్రానికి తీసుకు రావాలని కోరింది. ఇంత మందిని గల్ఫ్ నుంచి రాష్ట్రానికి తరలించటం మామూలు విషయం కాదు.
తెలంగాణ సెంటిమెంట్ పండేలా మాటలు చెప్పే కేసీఆర్ కు తెలంగాన కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వినతిపై అంతో ఇంతో స్పందించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు చురుగ్గా వ్యవహరించటం లేదన్న విమర్శలు వినిపిస్తున్న వేళ.. గళం విప్పిన కాంగ్రెస్ నేతల కారణంగా కేసీఆర్ సారుకు కొత్త కష్టం తప్పందంటున్నారు. గల్ఫ్ లో ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది తెలంగాణ వారి విషయంలో కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.