Begin typing your search above and press return to search.

తెలంగాణ‌ మిన‌హాయింపులు ఇవే..

By:  Tupaki Desk   |   6 May 2020 3:45 AM GMT
తెలంగాణ‌ మిన‌హాయింపులు ఇవే..
X
లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు కొన్ని మిన‌హాయింపులు ప్ర‌క‌టించారు. లాక్‌డౌన్ మే 29వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూనే కొన్ని ప్రాంతాల్లో కొన్ని దుకాణాలు తెరుచుకోవ‌చ్చ‌ని తెలిపారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ప్రారంభ‌మైన మంత్రివ‌ర్గ స‌మావేశం రాత్రి 9.30గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. మంత్రి వ‌ర్గంలో సుదీర్ఘ చ‌ర్చ చేశారు. స‌మావేశం ముగిసిన వెంట‌నే రాత్రి సీఎం కేసీఆర్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో అన్ని అంశాల‌ను కూలంక‌షంగా వివ‌రించారు.

ముఖ్యంగా వ్య‌వ‌సాయం ప‌నుల‌తో పాటు గృహ నిర్మాణ ప‌నుల‌కు అనుమ‌తులు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎలక్టిక‌ల్‌, హార్డ్‌వేర్ దుకాణాలు కూడా తెరిసి ఉంటాయ‌ని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను ఎప్ప‌టిలాగే స‌హ‌క‌రించాల‌ని.. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఎదుర్కొంటార‌ని హెచ్చ‌రించారు. గ్రామీణ స్థాయిలో అన్ని దుకాణాలు ప్రారంభించుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్‌, రంగారెడ్డి జిల్లాలో ఏ దుకాణాల్లో తెర‌వ‌మ‌ని కేసీఆర్ తెలిపారు. మున్సిపాలిటీల్లో 50 శాతం దుకాణాలు తెరుస్తాయ‌ని.. ద‌శ‌ల‌వారీగా పొడిగిస్తామ‌ని చెప్పారు. ఉద‌యం 10 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు దుకాణాలు తెరుచుకోవ‌చ్చు. మే 15వ తేదీన అత్యున్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించి మ‌రోసారి స‌మీక్షిస్తామ‌ని తెలిపారు.

మిన‌హాయింపులు
- య‌థావిధిగా వ్య‌వ‌సాయ ప‌నుల‌కు మిన‌హాయింపులు.
- స్టాంప్స్‌, రిజిస్ట్రేష‌న్‌కు అనుమ‌తి. భూముల అమ్మ‌కాలు, కొనుగోళ్లు చేసుకోవ‌చ్చు.
- ఇసుక స‌ర‌ఫ‌రా, ర‌వాణా శాఖ (వాహ‌నాల రిజిస్ట్రేష‌న్లు త‌దిత‌ర‌).
- మే నెల‌లోనే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం. హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం ప‌రీక్ష‌లు జ‌రిపిస్తాం. ఇంట‌ర్మీడియ‌ట్ వాల్యుయేష‌న్ బుధ‌వారం నుంచి ప్రారంభిస్తాం.
- న్యాయ‌వాదుల‌ను ఆదుకునేందుకు రూ.25 కోట్లు మంజూరు. చీఫ్ జ‌స్టిస్ అధ్య‌క్ష‌త‌న‌ క‌మిటీ ఏర్పాటుతో యువ న్యాయ‌వాదులు, పేద న్యాయ‌వాదుల‌ను ఆదుకునేందుకు ట్ర‌స్ట్‌ ఏర్పాటు.
- వ‌ల‌స కార్మికుల‌కు 7.50ల‌క్ష‌ల మందిని ఆదుకుంటున్నాం. సొంత ప్రాంతాల‌కు వెళ్తామ‌నే కార్మికుల‌కు త‌ర‌లించేందుకు సిద్ధం. కానీ ఇక్క‌డ ఉపాధి అవ‌కాశం కల్పించేందుకు కృషి. క‌డుపు నిండా భోజ‌నం.. చేతినిండా ప‌ని క‌ల్పిస్తున్న‌ట్లు సొంత ప్రాంతాల‌కు వెళ్లాల్సిన ప‌నిలేద‌ని స్ప‌ష్టం చేశారు.
- గ్రీన్ లేదు.. రెడ్ లేదు.. అన్ని జిల్లాల్లో మే 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 6గంట‌ల‌ వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చారు. మండల కేంద్రం, రూరల్‌ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి. మున్సిపాలిటీల్లో 50 శాతం షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
- ఆర్టీసీ సర్వీసులు ఇప్పుడు ప్రారంభం కావు. 15వ తేదీ తర్వాత ప్రైవేటు బస్సులు నడిచే అవకాశం ఉంది. గ్రీన్‌జోన్‌లో ఆటోలు, క్యాబ్‌లకు అవకాశం.

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేశార‌ని.. సింగిల్ డెత్ లేకుండా క‌రీంన‌గ‌ర్ జిల్లా నిలిచింద‌ని తెలిపారు. రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు రాష్ట్రంలో ప‌క్కాగా తీసుకుంటున్నామ‌ని, క‌లెక్ట‌ర్, వైద్యారోగ్య శాఖ అధికారులు అంద‌రూ స‌మ‌న్వ‌యం తో ప‌ని చేస్తున్న‌ట్లు వారికి అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అత్యంత జ‌నాభా సాంద్ర‌త ఉన్న హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాలో అధికంగా క‌రోనా కేసులు ఉన్నాయ‌ని తెలిపారు. మొత్తం కేసుల్లో 726 ఈ జిల్లాల నుంచే ఉన్నాయ‌ని అవి మొత్తం 66శాతం ఉన్నాయ‌ని, 29 మంది మృతుల్లో 25మంది ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.