Begin typing your search above and press return to search.

గడిచిన వందేళ్లలో తిరుమల కొండ మీద ఎప్పుడూ అలా జరగలేదట

By:  Tupaki Desk   |   28 April 2020 12:30 AM GMT
గడిచిన వందేళ్లలో తిరుమల కొండ మీద ఎప్పుడూ అలా జరగలేదట
X
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం.. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలన్న ఆదేశాలు ఇవ్వటం తెలిసిందే. ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు.. కఠినమైన చర్యల్ని తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ కారణంగా గడిచిన వందేళ్లలో ఎప్పుడూ ఎదురుకాని ఎన్నో సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో గడిచిన కొద్ది వారాలుగా భక్తుల్ని అనుమతించకపోవటం తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచంలోని పలు అధ్యాత్మిక కేంద్రాల్ని మూసి వేశారు.

రోజువారీగా జరిపే క్రతువుల్ని నిర్వహిస్తున్నా.. ప్రజలకు మాత్రం అనుమతించటం లేదు. దీంతో.. నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమల కొండ ఇప్పుడు బోసిపోయింది. నలభై ఐదు రోజులుగా భక్తులు లేని పరిస్థితి ఇటీవల కాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని చెబుతున్నారు. సాధారణంగా తిరుమలలో భక్తుల వేసే కానుకలతో పాటు.. సేవా కార్యక్రమాలు.. కల్యాణోత్సవాలు.. ప్రసాదాలు.. అద్దె గదుల మీద వచ్చే ఆదాయం రూ.150 నుంచి రూ.170 కోట్ల వరకు ఉంటుంది. ఇంత భారీ మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవటం గడిచిన వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితులతో ఆదాయ వనరులకు లోటు ఏర్పడటంతో.. దాన్ని పూడ్చుకునేందుకు ఏం చేయాలన్న ఆలోచనలో టీటీడీ ఉంది. ఇప్పటికే సంబంధిత అధికారులతో టీటీడీ ఛైర్మన్ సమాలోచనలు చేస్తున్నారు. ఆదాయం పూర్తిగా పడిపోయి నేపథ్యంలో.. ఆ లోటును పూడ్చుకోవటం.. ఖర్చుల్ని తగ్గించుకోవటం ఎలా అన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే టీటీడీ ఛైర్మన్.. పాలకమండలి సభ్యులు నెల వారీగా తమకిచ్చే జీతాల్ని తీసుకోవటం మానేయటం తెలిసిందే.