Begin typing your search above and press return to search.

షాకింగ్: ఒక్కదేశంలో 12 రకాల కరోనా వైరస్ లా?

By:  Tupaki Desk   |   7 May 2020 12:30 AM GMT
షాకింగ్: ఒక్కదేశంలో 12 రకాల కరోనా వైరస్ లా?
X
చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికి పాకి వేల మందిని బలి తీసుకుంటోంది. ఇప్పటికే లక్షలమందికి సోకింది. దీన్ని నియంత్రించేందుకు అన్ని దేశాలు తలపట్టుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం చేతులెత్తేసింది. ఇంతకీ ఈ కరోనా వైరస్ ఒక్కటేనా? ఇందులో ఎన్ని రకాలున్నాయనే దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలకు షాకింగ్ విషయం బయట పడింది. భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువైంది. వేల మంది భారతీయులను ప్రభావితం చేసిన కరోనావైరస్ పై భారతదేశం ఇంకా జన్యు స్థాయి పరిశోధన కొనసాగిస్తోంది. అయితే ఇప్పటికే అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్ శాస్త్రవేత్తలు రోగుల ద్వారా సేకరించిన కరోనావైరస్ జాతులపై పరిశోధన చేయడంలో బిజీగా ఉన్నారు.

వారంతా తమ దేశంలో సోకుతున్న కోవిడ్ -19 వైరస్ యొక్క ఉత్పరివర్తనాల గురించి తాజాగా ఆశ్చర్యకరమైన వెల్లడించారు. 260 రోగులకు రోగులను కరోనా వైరస్ ను విశ్లేషించిన తరువాత, బ్రిటీష్ జన్యు శాస్త్రవేత్తలు కోవిడ్ -19 దాదాపు 12 రకాల ఉత్పరివర్తనలు తమ దేశంలో ఉన్నట్లు కనుగొన్నారు. అంటే 12 రకాల కరోనా వైరస్ లు ఇంగ్లండ్ దేశంలో రోగులకు వ్యాపిస్తున్నట్టు తేల్చారు.

అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, ఆ జాతులలో ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కనిపించకపోవడం విశేషం. ఇది యునైటెడ్ కింగ్ డమ్ లో మాత్రమే వెలుగుచూసిందట.. అంటే ఇది పూర్తిగా యూకే స్వదేశీ కోవిడ్ -19 వైరస్ గా అక్కడి శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. .

కరోనా మహమ్మారి మొదట మార్చిలో ఎక్కువగా వ్యాపించిన ఇటలీ , స్పెయిన్ నుండి బ్రిటన్ దేశానికి దిగుమతి అయ్యింది.ఇతర దేశాల నుండి దిగుమతి అయిన వైరస్ లలో బ్రిటన్ లో ఏ వైరస్ జాతి ఎక్కువగా ప్రబలుతోందనేది పరిశోధకులు వెల్లడించలేదు.

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తెస్తున్న పరిశోధకులకు ఇలా 12 రకాల కరోనా వైరస్ లు ఉన్నాయని తెలియడంతో ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్లు బ్రిటన్‌ దేశ ప్రజలపై ప్రభావం చూపవనే ఆందోళన మొదలైంది. ఇదే జరిగితే వినాశనం తప్పదు. కరోనావైరస్ అన్ని జాతులకు అనుకూలంగా వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు భయపడుతున్నారు.