Begin typing your search above and press return to search.
వుహాన్ లో మళ్లీ కరోనా కలకలం ...ఏమైందంటే ?
By: Tupaki Desk | 2 May 2020 10:10 AM GMTకరోనా మహమ్మరి ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి మరింతగా పెరిగిపోతుంది. ఈ కరోనా దెబ్బకి అమెరికా అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ మహమ్మారి గాలి ద్వారా వ్యాపించదని ప్రత్యక్ష తాకిడి తోనే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మరి కొందరు శాస్త్రవేత్తలు గాలిలో కూడా కొంత దూరం వైరస్ వ్యాపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా కరోనా పై రోజుకొక వార్త వెలుగులోకి వస్తుంది.
ఈ తరుణంలో తాజాగా వుహాన్ లో సంచలన విషయాలు బయట పడ్డాయి. వుహాన్ లోని కరోనా ఆస్పత్రుల్లో ఇప్పటికి కూడా కరోనా వైరస్ జాడలు ఉన్నట్టు గుర్తించారు. అయితే నివాస ప్రాంతాల్లోని గాలిలో మాత్రం ఎలాంటి వైరస్ జాడలు కనిపించలేదట. వుహాన్ నగరంలోని రెండు ఆసుపత్రులలోని గాలిలోని తుంపర్లలో కరోనా ను గుర్తించినట్టు నేచర్ పత్రికలో ప్రచురితమైన కథనం ఇప్పుడు వుహాన్ లో కలకలం రేపుతోంది.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో వుహాన్ లోని రెన్మిన్ ఆసుపత్రితోపాటు కరోనా బాధితులను క్వారంటైన్ చేసిన తాత్కాలిక కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు గాలి నమూనాలను సేకరించారు. కాగా జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలు, ఐసోలేషన్ వార్డులు, బాధితుల గదులు, గాలి సరిగ్గా ఆడని బాత్రూమ్ గాలిలో కొద్ది స్థాయిలో వైరస్ జాడలు ఇంకా ఇప్పటికి కూడ ఉన్నట్టు గుర్తించారు. శాస్త్రవేత్తలు బయట కూడా నమూనాలు సేకరించగా అక్కడ ఎలాంటి వైరస్ జాడలు కనియించలేదు. అయితే గాలిలో ఉన్న కరోనా వైరస్ ఎంత వరకు ప్రభావం చూపుతుందన్నది చూడాలి మరి.