Begin typing your search above and press return to search.
కరోనా వైరస్ పేరు మారిపోతుందా?
By: Tupaki Desk | 21 March 2020 3:49 PM GMTయావత్తు ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పేరు వింటేనే వణికిపోతున్నాయి. ఈ వైరస్ బారి నుంచి తన ప్రజలను కాపాడుకునేందుకు ఆయా దేశాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. మన దేశ ప్రభుత్వం ఏకంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పేరిట ఏకంగా యావత్తు దేశాన్ని బయటకు రాకుండా ప్రణాళికలు రచించింది. ఇలాంటి నేపథ్యంలో కరోనా అంటే... అదేంటో తెలియని పిల్లలు కూడా భయపడిపోయే పరిస్థితి నెలకొంది. అయితే కరోనా, లేదంటే కోవిడ్-19 గా పిలుచుకునే ఈ మహమ్మారి వైరస్ ఇకపైనా ఇదే పేరుతో కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. దీనికి అగ్రరాజ్యం, ప్రపంచ పోలీస్ గా పేరుగాంచిన అమెరికా వైఖరేనని చెప్పక తప్పుదు.
అయినా అంతా కరోనా అని పిలుచుకునే ఈ వైరస్ పేరు మార్చాలని అగ్రరాజ్యం గానీ, ఆ దేశ అధినేత డొనాల్డ్ ట్రంప్ గానీ ఎందుకు యత్నిస్తున్నారంటే... దాని వెనుక చాలా కథే ఉందని చెప్పాలి. కరోనా వైరస్ చైనా నుంచే ప్రస్థానం ప్రారంభించిన సంగతి తెలిసిందే. చైనాలోని వూహాన్ నగరంలో ఉనికిలోకి వచ్చిన ఈ వైరస్ చైనా ప్రభుత్వం వైఖరి కారణంగానే ఇతర దేశాలకు పాకిందన్నది ట్రంప్ భావన. అందుకే ఆయన దీని పేరును కరోనాగా కాకుండా 'చైనా వైరస్' గా నామకరణం చేశారు. ఈ వైరస్ వ్యాప్తి చెందిన నాటి నుంచి కూడా ఎప్పుడు మీడియా తో మాట్లాడినా కూడా ఈ వైరస్ ను ఆయన చైనా వైరస్ గానే పిలుస్తున్నారు.
ఇటీవల జరిగిన ఓ మీడియ సమావేశంలో కరోనా వైరస్ ను చైనా వైరస్ అని ఎందుకు పిలుస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి అడిగితే... దాని పేరు చైనా వైరస్సేనని ట్రంప్ కాస్తంత గట్టిగానే సమాధానమిచ్చారు. ట్రంప్ వైఖరి చూస్తుంటే... కరోనా వైెరస్ అని పిలిచేందుకు ఆయన ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. తనతో భేటీ అయిన ఓ దేశ కీలక అధికారికి కరోనా సోకిందన్న వార్తలు వినబడగానే... ట్రంప్ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. అదే పాజిటివ్ అని వచ్చి ఉంటే పరిస్థితి ఏమిటన్నది ఆసక్తి రేకెత్తించే ప్రశ్నే. మొత్తంగా చైనా నిర్లక్ష్య వైఖరి కారణంగానే కరోనా ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోందన్న భావనకు వచ్చిన ట్రంప్... దాని పేరును చైనా వైరస్ గా నామకరణం చేసేశారు. సో... రానున్న రోజుల్లో కరోనాను చైనా వైరస్ అని పిలిచినా ఆశ్చర్యపోనక్కర లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.