Begin typing your search above and press return to search.
క్వారంటైన్ సెంటర్ లో యోగాసనాలు వేస్తున్న కరోనా వైరస్ రోగులు, వైద్యులు !
By: Tupaki Desk | 22 July 2020 6:00 AM ISTకరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. రోజురోజుకి కరోనా భారిన పడేవారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కోటి నలభై ఎనిమిది లక్షల మంది కరుణ బారిన పడిన ఆరు లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇక మన దేశంలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షలకి చేరువలో ఉంది. తాజాగా 24 గంటల్లో 37148 కేసులు నమోదయ్యాయి. అలాగే మొత్తం మరణాల సంఖ్య 28084కి చేరింది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో భారత్ టాప్ 3లో ఉండగా... రోజువారీ కేసుల్లో టాప్ 2లో ఉంది. మొత్తం మరణాల్లో ఇండియా టాప్ 8లో ఉండగా... రోజువారీ మరణాల్లో బ్రెజిల్ తర్వాత ఇండియా సెకండ్ ఉంది. ఇదివరకు మొదటిస్థానంలో ఉన్న అమెరికా ఇప్పుడు మూడోస్థానానికి చేరింది.
ఇకపోతే దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కరోనా అనుమానితులని పెట్టడానికి కరోనా కేంద్రాలను కూడా ఎక్కువగా ఏర్పాటుచేస్తున్నారు. విదేశాల నుండి , కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుండి వచ్చిన వారిని ఆ కరోనా కేంద్రాలకు తరలిస్తూ వారికీ అక్కడ ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అక్కడ ప్రభుత్వం నిర్దేశించినన్ని రోజులు ఉన్న తరువాత కరోనా నిర్దారణ పరీక్షలు చేసి కరోనా నెగటివ్ అని వస్తే ఇంటికి ..పాజిటివ్ అని వస్తే ఆసుపత్రికి తరలించి కరోనా కి చికిత్స అందిస్తున్నారు. అయితే క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న కొంతమంది నిరాశగా ఉంటె మరికొంతమంది దైర్యంగా ఉంటూ పాటలు పడుతూ ..డ్యాన్సులు చేస్తున్న వీడియోలు ఎన్నో ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. క్వారంటైన్ కేంద్రంలో ఉన్న కరోనా భాదితుల్లో ఆత్మస్తైర్యం నింపాడటానికి దిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్ కేంద్రంలో వైద్యులు, కరోనా బాధితులతో కలిసి యోగాసనాలు వేశారు. ఇలా ఒకవైపు చికిత్స చేస్తూ మరోవైపు వారిలో ఆత్మస్తైర్యం నింపుతున్న వైద్యులకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము. ప్రాణాలు పోతాయి అని తెలిసినా కూడా ..తమ ప్రాణాలని పనంగా పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.