Begin typing your search above and press return to search.
కరోనా వైరస్ ఏ జంతువు నుండి వ్యాప్తి చెందిందంటే ?
By: Tupaki Desk | 21 March 2020 11:30 PM GMTకరోనా వైరస్.... 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో బయటపడి చైనా దేశాన్ని నాశనం చేసింది. కరోనా దెబ్బకి చైనా మొత్తం ఇప్పటికి కూడా షట్ డౌన్ అయ్యింది. ఆ తరువాత చైనా నుండి ఒక్కోక్క దేశానికీ విస్తరిస్తూ ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాకింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. 2లక్షల మందికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచాన్ని గజగజవణికిస్తున్న కరోనా వైరస్.. ఎలా వచ్చింది? అసలు ఏ జాతి నుంచి, జంతువు నుంచి కరోనా వైరస్ వచ్చింది? దీనికి మూలం ఏంటి? అనేది ఇప్పటికి ఇంకా మిస్టరీగానే ఉంది.
కరోనా వైరస్ కు అసలు మూలం తెలుసుకునేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజా అధ్యయనం లో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఏ జాతి జంతువులో కరోనా వచ్చింది అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. గబ్బిలం ద్వారా వచ్చిందా, పాంగోలిన్ ద్వారా వచ్చిందా, లేక మరో జంతు జాతి నుండి వచ్చిందా అనే విషయం తెలియాల్సి ఉంది. కరోనా వైరస్ కి మూలం తెలుసుకునేందుకు చేసిన పరిశోధనల్లో బీటా కరోనావైరస్ ను కనుగొన్నారు. ఇవి ప్రధానంగా గబ్బిలాల్లో ఉంటాయి. యునాన్ ప్రావిన్స్‌లో సేకరించిన రినోలోఫస్ అఫినిస్ జాతి గబ్బిలం నుండి వేరుచేయబడిన RaTG13, ఇటీవల SARS-CoV-2 కు సమానమైనదిగా గుర్తించారు. జన్యు శ్రేణులు 96శాతం సమానంగా ఉంటాయి. ఈ ఫలితాలు గబ్బిలాలు, రినోలోఫస్ జాతికి చెందిన ప్రత్యేక జాతులలో, SARS-CoV , SARS-CoV-2 వైరస్ లు కలిగి ఉన్నాయని సూచించాయి.
అదే సమయంలో మరో జాతికి చెందిన జంతువు జన్యువు పైనా పరిశోధనలు జరిగాయి. 2020 ఫిబ్రవరి 7, SARS-CoV-2 కి దగ్గరగా ఉన్న వైరస్ పాంగోలిన్ లో కనుగొన్నారు. 99శాతం జన్యు సంబంధమైన సమన్వయం తో, ఇది గబ్బిలాల కంటే ఎక్కువ జలాశయాన్ని సూచించింది. మలేషియా పాంగోలిన్ నుండి వేరు చేయబడిన కరోనా వైరస్ జన్యువు SARS-Cov-2 కు తక్కువ సారూప్యతను కలిగి ఉందని, ప్రస్తుతం 90శాతం జన్యు సంబంధమైన సమన్వయంతో సమీక్షలో ఉంది. పాంగోలిన్‌లో వేరుచేయబడిన వైరస్ ప్రస్తుతం ఉధృతంగా ఉన్న COVID-19 అంటువ్యాధికి కారణం కాదని ఇది సూచిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కరోనా వైరస్ కు అసలు మూలం ఏంటి అనేది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ కు చైనీయులే కారణం అని ఆరోపణలు ఉన్నాయి. వారి ఆహారపు అలవాట్ల వల్లే కరోనా వచ్చిందని అంటున్నారు. చైనీయులు గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు, పాంగోలిన్ వంటి వాటిని తింటారని, ఆ విపరీత ఆహారపు అలవాట్ల వల్లే కరోనా వైరస్ మహమ్మారి వచ్చిందని మండిపడుతున్నారు.