Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : పిల్లుల నుండి మనుషులకి కరోనా?
By: Tupaki Desk | 3 April 2020 5:30 AM GMTకరోనా వైరస్ ప్రస్తుతం ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఈ కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా మహమ్మారి భారిన ఇప్పటివరకు 10 లక్షల మంది పడ్డారు. అలాగే దాదాపుగా 53 వేల మంది కరోనా కారణంగా మృతిచెందారు. ఇకపోతే ఈ కరోనా వైరస్ కేవలం మనుషులకే కాదు జంతువులకి కూడా సోకుతుంది అని తెలిసిందే.
ఇప్పటికే హంగ్ కాంగ్ లో రెండు కుక్కలకి - బెల్జియంలో ఒక పిల్లికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో జంతువుల నుండి ఈ వైరస్ మనుషులకి సోకే అవకాశం ఉందా అంటే , అంటే చెప్పలేం అంటున్నారు పరిశోధకులు. ఇటీవల బెల్జియంలో ఓ పిల్లికి దాని యజమాని నుంచి కరోనా సంక్రమించిన నేపథ్యంలో.. శాస్తవేత్తలు ఈ దిశగా పరిశోధనలు చేపట్టారు. ఇందులో భాగంగా పిల్లుల్లో ఒకదాని నుంచి మరొకదానికి ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.
ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు ఓ మూడు పిల్లులకు కరోనా వైరస్ ను ఇంజెక్ట్ చేసి - వాటితో ఆరోగ్యవంతమైన మరో రెండు పిల్లులను కలిపి ఒకే బోనులో ఉంచారు. బయటకు తీసుకొచ్చాక పరీక్షించగా ఓ పిల్లిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే, కుక్కలు - పందులు - కోళ్లు లాంటి వాటికి ఈ వైరస్ సోకే అవకాశాలు లేవని అంటున్నారు. కాగా పిల్లుల నుంచి మనుషులకు సోకదు అని నిర్ధారణకు వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇకపోతే కరోనా మహమ్మారి చైనా తో పాటుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన తరువాత చైనాలోని షెన్ జేన్ నగరం.. పిల్లి - కుక్క మాంసం వినియోగంపై పూర్తిగా నిషేధం విధించింది. ప్రస్తుతానికిది ఒక్క నగరానికే పరిమితమైనా కూడా మిగిలిన నగరాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ..కరోనా మహమ్మరే అని చెప్పవచ్చు.