Begin typing your search above and press return to search.
కరోనా వైరస్ గాల్లో అంతసేపు మాత్రమే ఉంటోందట..!
By: Tupaki Desk | 13 Jan 2022 2:32 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించిన కొత్త వాస్తవం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాను దారుణంగా దెబ్బ తీస్తూ.. ఆ దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఈ మహమ్మారి దెబ్బకు.. వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
గడిచిన వందేళ్లలో ఇంతటి ఇబ్బందికర పరిస్థితిని వారిప్పటి వరకు ఎదుర్కొనలేదని చెబుతున్నారు. అదే విధంగా యూకే ప్రజలది ఇదే పరిస్థితి. ఇలా.. అగ్ర రాజ్యాలు మొదలు ప్రపంచంలోని పలు దేశాల్ని తాట తీస్తున్న ఈ కరోనా మహమ్మారికి సంబంధించి ఒకకొత్త విషయాన్ని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
వైరస్ ప్రభావం గాల్లో ఎంతవరకు ఉంటుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం ఇచ్చేలా యూకేలోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ ఒక అధ్యయన పత్రాన్ని విడుదల చేసింది. అయితే.. దీన్ని పూర్తి స్థాయిలో సమీక్షించలేదు కానీ.. ఇందులో పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఈ రిపోర్టు ప్రకారం కరోనా వైరస్ గాల్లో 20 నిమిషాల పాటు ఉంటే.. దాని సామర్థ్యం 90 శాతానికి క్షీణిస్తున్నట్లుగా గుర్తించారు.
గాల్లో ఉన్న ఐదు నిమిషాల వ్యవధిలోనే అధిక శాతం సంక్రమణ (వ్యాప్తి) శక్తిని కోల్పోయినట్లుగా తేల్చారు. దీన్ని చూస్తే.. కోవిడ్ వ్యాప్తికి చెక్ చెప్పాలంటే.. ముఖానికి మాస్కు అత్యవసరమని.. అదెంతో కాపాడుతుందనిచెబుతున్నారు. మాస్కులు ధరించటం.. భౌతిక దూరాన్ని పాటించటం లాంటివి పక్కాగా ఫాలో కావటం ద్వారా.. కొవిడ్ వ్యాప్తికి చెక్ పెట్టొచ్చన్న మాట చెబుతున్నారు.
అంతేకాదు.. వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాల్లో వైరస్ అధికంగా వ్యాప్తి చెందే వీలుందని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రజలు దగ్గరగా ఉంటేనే వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని.. ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కరోనా ఫ్యామిలీలో సభ్యుడైన ఒమిక్రాన్ వేరియంట్ కాస్త భిన్నంగావ్యవహరిస్తోంది.
మిగిలిన వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ లో లక్షణాలు లేని వారు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. వీరి కారణంగా ఈ వేరియంట్ వ్యాప్తి మరింత ఎక్కువ అవుతున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు.