Begin typing your search above and press return to search.

న్యూయార్క్ నగరంలో సంచలనం మారిన కరోనా సుసైడ్

By:  Tupaki Desk   |   30 March 2020 4:15 AM GMT
న్యూయార్క్ నగరంలో సంచలనం మారిన కరోనా సుసైడ్
X
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ వేలాదిమందిని పొట్టన బెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా నేటి (29, మార్చి) వరకు 32 వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి ప్రత్యక్షంగానే కాదు.. పరోక్షంగా కూడా ప్రాణాలు తీసుకుంటోంది. కరోనా సోకిందనే ఆందోళనతో ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. న్యూయార్క్ సిటీలో ఓ వ్యక్తి భారీ భవంతి నుండి దూకి చనిపోయాడు. దాదాపు 25 నుండి 30 అంతస్తులు కలిగిన బిల్డింగ్ నుండి కిందకు దూకేశాడు. కిందకు దూకి ఫుట్‌పాత్‌పై పడి అక్కడి నుండి రోడ్డుపై పడి చనిపోయాడు.

కరోనా సోకిందనే భయంతో తెలుగు రాష్ట్రాల్లోను ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. కర్ణాటక లో ఓ వ్యక్తి ఈ మహమ్మారి సోకిందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల రాజమండ్రిలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోనూ ఒకరు ఒంటిపై కిరోసిన్ పోసుకొని చనిపోయాడు.

రాజమహేంద్రవరంలో దంపతులు మృతి చెందారు. సంఘటనా స్థలంలో వారు రాసిన లేఖలో కరోనా రావటం వల్ల తాము చనిపోతునట్టు ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిని రాజమండ్రి పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్‌గా పని చేసే రమేష్, వెంకటలక్ష్మిలుగా గుర్తించారు.

ఇక, సూర్యాపేటలో శ్రీను అనే వ్యక్తి లాక్ డౌన్ కారణంగా సొంతూరుకు తిరిగి వచ్చిన వారితో కలిసి తిరిగాడు. సొంతూరుకు తిరిగి వచ్చిన వారికి వైద్య సిబ్బంది క్వారంటైన్ స్టిక్కర్ వేసింది. ఆ తర్వాత అతనికి కూడా జ్వరం వచ్చింది. ఆసుపత్రికి వెళ్లగా జ్వరం మాత్రమేనని, కరోనా లేదని చెప్పారు. అయినా అతనిని కరోనా భయం వీడలేదు. అతను కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.