Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్ ..ఇకపై నిమిషాల్లోనే కరోనా నిర్దారణ పరీక్షలు!

By:  Tupaki Desk   |   26 March 2020 12:38 PM GMT
గుడ్ న్యూస్ ..ఇకపై నిమిషాల్లోనే కరోనా నిర్దారణ పరీక్షలు!
X
ప్రపంచాన్ని గజగజవణికిస్తున్న కరోనా వైరస్‌ నిర్ధారణకు బ్రిటన్‌ పరిశోధకులు సులువైన విధానాన్ని కనుగొన్నారు. నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్‌ ను నిర్ధారించే స్మార్ట్‌ ఫోన్‌ ఆధారిత పోర్టబుల్‌ కిట్‌ ను రూపొందించారు. గొంతు నుంచి సేకరించిన నమూనాతో ఈ కిట్‌ ద్వారా 50 నిమిషాల్లోనే కరోనాను నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ల్యాబ్‌ పరీక్షల ద్వారా కోవిడ్‌ నిర్ధారణకు 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది.

అయితే, తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా కు చెందిన పరిశోధకులు రూపొందించిన కిట్‌ తో కేవలం 50 నిముషాల్లోనే స కరోనాని గుర్తించవచ్చు. ఈ కిట్‌ ను నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ రెండు వారాల పాటు పరీక్ష చేయనుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. కిట్‌ ద్వారా ఒకేసారి 16 నమూనాలను పరీక్షించే వీలుందని పరిశోధకులు వెల్లడించారు. తమకు వైరస్‌ సోకిందో - లేదో తెలుసుకోవడం పాటు తమ ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా చేయడానికి ఈ కిట్‌ ఉపయోగపడుతుందని వివరించారు.

ఎన్‌ హెచ్‌ ఎస్‌ సిబ్బందికి వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న ఆలోచనతో ఈ కిట్‌ ను తయారుచేశాం. వారు ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ సమయం వైద్య సేవలు అందించగలుగుతారు. ఒకవేళ వైరస్‌ సోకిందని తెలిస్తే వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా చేయడానికి వెంటనే వీలు కలుగుతుంది. రెండు వారాల్లో దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో ఈ కిట్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. గొంతు నుంచి సేకరించిన నమూనా నుంచి 3 నిమిషాల్లోనే ఆర్‌ ఎన్‌ ఏను వెలికితీసి కరోనా నిర్థారిత పరీక్షలు చేస్తాం అని - తక్కువ నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కూడా ఈ కిట్‌ ను ఉపయోగించేలా రూపొందించామని పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన జస్టిన్‌ ఓ గ్రాడీ తెలిపారు.