Begin typing your search above and press return to search.

కంటతడి పెట్టిస్తున్న 15సెకన్ల వీడియో..

By:  Tupaki Desk   |   5 Feb 2020 8:40 AM GMT
కంటతడి పెట్టిస్తున్న 15సెకన్ల వీడియో..
X
చైనాలో పుట్టినా.. ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది కరోనా వైరస్. ఎప్పుడు ఏ రూపంలో తమ మీద పడుతుందో భయాందోళనలకు గురవుతున్నాయి వివిధ దేశాలు. ఇప్పటికే ఇరవైఆరు దేశాల్లో కరోనా వైరస్ వెలుగు చూసింది. ఇక.. వందలాది మంది చైనాలో మరణిస్తే.. వేలాది మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. లక్షలాది మంది వైరస్ అనుమానితుల్లో ఉన్నారు.

ఇలాంటివేళ.. కరోనా వైరస్ బారిన పడిన ఒక వృద్ధ దంపతులకు చెందిన చిట్టి వీడియో ఇప్పుడు ప్రపంచాన్ని కంట తడి పెట్టిస్తోంది. కరోనా వైరస్ సోకిన వారు బతుకుతామన్న ఆశ లేని దుస్థితి. ఇప్పటికి వైరస్ కు చెక్ పెట్టేందుకు అవసరమైన వ్యాక్సిన లేని నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచే మందులు ఇస్తూ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ సోకిన 80 ఏళ్ల వయసున్న జంట చైనాలోని ఒక ఆసుపత్రిలో పక్క పక్కనే ఉన్న బెడ్ల మీద చికిత్స పొందుతున్నారు. జీవితాన్ని చూసేసినా.. కరోనా కారణంగా ఆ ఇద్దరు దంపతులు సత్తువ లేక ఉండిపోయారు. ఆసుపత్రిలో దంపతులు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ.. ఆ క్రమంలో తాము ప్రయాణం చేసిన సుదీర్ఘ కాలాన్ని నెమరివేసుకుంటూ.. తమ అనుబంధానికి గుర్తుకు చేయి పట్టుకొని చివరిసారిగా మాట్లాడుకుంటున్న వీడియోను ఎవరో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

వారు కలుసుకోవటం ఇదే చివరిసారేమో అంటూ దీన్ని పోస్టు చేసిన వ్యక్తి కామెంట్ చేస్తూ షేర్ చేశారు. ఈ పదిహేను సెకన్ల వీడియోను చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి పరిస్థితిని చూస్తుంటే భయమేస్తుందని ఒకరు వ్యాఖ్యానిస్తే.. ఇదెంతో విషాదకరమైన వీడియో.. జీవితపుచివరి క్షణాల్లో వారి మధ్యనున్న ప్రగాఢ ప్రేమ ఎంతో వీడియో చూస్తుంటే తెలుస్తుందని పేర్కొన్నారు. వీడియోను చూస్తున్న చాలామంది వీరిద్దరూ కోలుకుంటే బాగుండన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరున్న పరిస్థితిని చూసిన వారంతా వేదన చెందుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి