Begin typing your search above and press return to search.

ప్రతిరోజూ గో మూత్రం తాగా.. కరోనా రాలేదు !

By:  Tupaki Desk   |   17 May 2021 3:30 PM GMT
ప్రతిరోజూ గో మూత్రం తాగా.. కరోనా రాలేదు !
X
చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి కరోనా వైరస్. ప్రస్తుతం ఈ వైరస్ కట్టడి కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైద్య సౌకర్యాల కొరత, ఇతర కారణాలతో వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఇలాంటి సమయంలో ఎంతో బాధ్యతతో ప్రజను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుంది. అయితే , కొందరు మాత్రం ఇంకా మూఢనమ్మకాలని ప్రచారం చేస్తున్నారు. ఆ రసం తాగితే కరోనా సోకదు , ఆ అప్పడం తింటే కరోనా మీ దరిదాపుల్లో అంటూ ఎన్నో మూఢనమ్మకాలు తెగ వైరల్ అయ్యాయి. గో మూత్రం, ఆవు పేడ కరోనాను అంతం చేస్తాయని అనడానికి రుజువులు లేవని శాస్త్రవేత్తలు నెత్తి, నోరు కొట్టుకుని చెబుతుంటే,బిజెపి నేతలు మాత్రం వీటి వల్ల కరోనా రాదని, దరి చేరదని ప్రేలాపనలు చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేసి మరోసారి వార్తల్లో నిలిచారు బిజెపి ఎంపి ప్రగ్యా ఠాకూర్‌. తాను ప్రతిరోజూ గోమూత్రం తీసుకోవడం వల్లే కరోనా రాలేందంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ గో మూత్రం తాగితే.. ఊపిరితిత్తులకు కరోనా దరిచేరకుండా చేస్తోంది. నాకు ఏదైనా నొప్పి అనిపించినప్పటికీ.. గో మూత్రం తీసుకుంటాను. అందుకే కరోనా వైరస్ సోకలేదు. కరోనాకు వ్యతిరేకంగా నేను ఎటువంటి మందులు వినియోగించలేదు అని పార్టీ సమావేశంలో అన్నారు. గో మూత్రం, రక్షణాదాయని అంటూ వ్యాఖ్యానించారు. ఆమెకు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో గో మూత్రం, ఇతర ఆవుకు సంబందించిన ఉత్పత్తులను వాడటం వల్లే క్యాన్సర్‌ తగ్గిందని అన్నారు. కాగా, కరోనా లక్షణాలు కనిపించడంతో డిసెంబర్‌ 2020లో డిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ప్రగ్యా చేరిన సంగతి తెలిసిందే.