Begin typing your search above and press return to search.
మళ్లీ రూపం మార్చుకున్న కరోనా!
By: Tupaki Desk | 10 May 2021 1:30 AM GMTప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా.. ఇప్పటికే ఎన్నో వేరియంట్లుగా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని వేరియంట్లు చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. ఈ డేంజరస్ జాబితాలో బి.1.617 అనే డబుల్ మ్యుటెంట్ ఒకటి. భారత్ తో సహా 17 దేశాలకు విస్తరించిన ఈ రకం.. ఇప్పుడు మరోసారి రూపం మార్చుకున్నది శాస్త్రవేత్తలు గుర్తించినట్టు సమాచారం.
అయితే.. గతం కన్నా మరింత బలంగా తయారైందని సైంటిస్టులు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రకం కేసులు భారత్, బ్రిటన్, స్పెయిన్ లో నమోదైనట్టు సమయాచారం. ఈ మేరకు హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ఈ వివరాలు వెల్లడించినట్టు సమాచారం. ఈ రకంలో మరికొన్ని మార్పులు గుర్తించామని, దీనిపై అధ్యయనం కొనసాగుతోందని చెప్పినట్టుగా తెలుస్తోంది.
కొవిడ్ వైరస్ ఇప్పటి వరకూ కొన్ని వందల రకాలుగా మార్పు చెందిందని మిశ్రా చెప్పినట్టు సమాచారం. ప్రతి నెలా వైరస్ లో రెండు మార్పులు సంభవిస్తున్నాయన్న ఆయన.. అందులో కొన్ని చాలా ప్రాణాంతకమైనవి ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. దీంతో.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పకుండా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, మాస్క్ పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.