Begin typing your search above and press return to search.
మహిళకు కరోనా వేధింపులు.. కేటీఆర్ ఆగ్రహం
By: Tupaki Desk | 27 March 2020 2:30 PM GMTకరోనా వైరస్ పుట్టింది.. వ్యాప్తి చెందింది చైనాలో. దీంతో చైనీయులంటే మనకు అసహ్యం ఏర్పడుతోంది. అయితే చైనీయుల మాదిరి మనదేశంలో ఈశాన్య భారతీయులు ఉంటారు. కొంచెం ముఖ కవలికలు, ఆహార్యం చైనీయుల మాదిరే ఉంటారు. దీంతో అలాంటి వారిపై భారతదేశంలో వివక్ష ఏర్పడుతోంది. చైనీయులంటూ కరోనా వైరస్ వారి వలన వ్యాప్తి చెందుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తెలంగాణలో ఇలాంటి ఘటన ఎదురైంది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళను హైదరాబాద్‌లో కొందరు వేధింపులకు గురి చేశారు. కరోనా వైరస్ అంటూ అవహేళన చేశారు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు తెలియడం తో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో నివసిస్తూ ఓ ప్రముఖ ఇంగ్ల దినపత్రికలో కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆమె కొంత చైనా దేశస్తురాలి మాదిరిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె గురువారం రాత్రి మందుల కోసం మెడికల్ షాప్‌కు ఆమె వెళ్లింది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న సుమారు 15 మంది యువకులు కరోనా వైరస్ అంటూ ఆమెను వెక్కిరించారు. దూరంగా ఉండండి అంటూ అవహేళన చేశారు. దీంతో ఆ మహిళా జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపం చెందిన చెందిన ఆమె ఈ విషయమై తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ట్వీట్ ను చూసిన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు సరికాదని, ఇలాంటి సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఏ దేశానికి చెందిన వారినైనా.. ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలనైనా కించపరిచే హక్కు గానీ, వారిని అవహేళనకు గురి చేసే అధికారం గానీ ఎవరికీ లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే ఆ విధంగా చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.