Begin typing your search above and press return to search.
ప్రతి వందేళ్ళకి ఒక అంటు వ్యాధి ..ఆ కోవలోనే కరోనా ...పూర్తి వివరాలు ఇవే !
By: Tupaki Desk | 3 March 2020 5:11 AM GMT1720లో ప్లేగు వ్యాధి: ఇప్పటికీ కాదు ..ఇప్పటికీ గుర్తుండి పోయే వ్యాధి ఈ ప్లేగు వ్యాధి. అంతలా అందరిని దహించివేసింది. 1720 సంవత్సరంలో ఈ ప్లేగు వ్యాధి సృష్టించిన బీభత్సము అంతా ఇంతా కాదు. ఇది ఎలుకల నుంచి వచ్చిన వ్యాధి. యూరప్, ఫ్రాన్సులోని మర్సెయిల్స్ లో బయటపడిన ఈ వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50 వేల మందిని బలి తీసుకుంది. ఆ తరువాత ఈ ప్లేగు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అందరిని భయంతో వణికి పోయేలా చేసింది. మొత్తం మీద ఫ్రాన్సు వ్యాప్తంగా లక్షమంది ఈ వ్యాధితో చనిపోయారు.
1820లో కలరా వ్యాధి: ఇప్పటికీ ఈ కలరా వ్యాధి గురించి ఎక్కడో ఓ చోట వినే ఉంటారు. ప్లేగు వ్యాధికి వందేళ్లు పూర్తవుతుండగానే కలరా ఆసియా దేశాలను కబళించింది. ఫిలిప్పైన్స్, థాయ్ లాండ్, ఇండోనేషియా దేశాల్లో ఈ వ్యాధి భారిన పడి దాదాపుగా లక్షమంది పైగా మరణించారు. కలరా బ్యాక్టిరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు.
1920లో స్పానిష్ ఫ్లూ: ఇక కలరా వ్యాధి వచ్చి మరో వందేళ్లు పూర్తికాకుండానే.. పరిచయమైన వైరస్.. స్పానిష్ ఫ్లూ. ఏకంగా 100 కోట్ల మంది ఈ స్పానిష్ ఫ్లూ బారిన పడగా.. ఒక కోటి మంది ఈ వ్యాధి వల్ల మరణించారు. మొత్తం ఈ సృష్టిలో అతి పెద్ద విషాదం మిగిల్చిన అతి భయంకరమైన వ్యాధిగా ఈ స్పానిష్ ఫ్లూ వైరస్ గుర్తుండి పోతుంది.
2020లో కరోనా వైరస్: స్పానిష్ ఫ్లూ వచ్చిన వందేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు చైనాలో కరోనా వైరస్ ప్రభావం మొదలైంది. చైనా లో మొదలైన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ వైరస్ మందు కనిపెట్టలేదు. దీనితో ప్రపంచం మొత్తం మరోసారి భయంతో వణికిపోతోంది. ఇప్పటికే మూడు వేల మందికి పైగా పొట్టన పెట్టుకున్న ఈ కరోనా ..ఇంకెతమందిని తీసుకు పోతుందో అని భయపడి పోతున్నారు.