Begin typing your search above and press return to search.
మందుబాబులకు కలిసొచ్చిన కరోనా
By: Tupaki Desk | 31 Jan 2020 4:31 PM GMTచైనాలో పుట్టిన కరోనా ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయపెడుతోంది. ఈ కరోనా వైరస్ దాటికి చైనా టూరిజం జీరోకు పడిపోయింది. చైనాతో అన్ని రకాల రాకపోకలను నిశితంగా గమనిస్తూ ఆంక్షలు విధిస్తున్నారు. మన దేశంలో అన్ని ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఏ కేసు నమోదు కాలేదు... కానీ జాగ్రత్తగా ఉండండి. మేము కూడా కిట్లు తెప్పిస్తాం అంటూ ప్రభుత్వం హెచ్చరించింది. దీనిని మందుబాబులు తమదైన శైలిలో వాడుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం మనకు తెలిసిందే. దీంతో మందుబాబుల్లోని నెటిజన్లు హైదరాబాదు పోలీసులకు ఒక ఆసక్తికరమైన వినతి చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో తాత్కాలికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో బ్రీత్ ఎనలైజర్లను నిషేధించాలని వారు అడుగుతున్నారు. సెన్సిటివ్ విషయాన్ని... కావడంతో పోలీసులు కూడా వారికి ఏ రిప్లై ఇవ్వలేకపోతున్నారు. కరోనా వైరస్ అనేది అంటు వ్యాధి. ఒకరి నుంచి ఒకరికి జలుబు - దగ్గులాగే వ్యాపిస్తుంది.
ఈ నేపథ్యంలో ఒకవేళ కరోనా ఉన్న వ్యక్తి వాడిన బ్రీత్ ఎనలైజర్ ఇంకొకరికి వాడితే కచ్చితంగా సోకే అవకాశం ఉంది. అయితే... తెలంగాణలో ఇంకా ఆ కేసులు నమోదు కాలేదు. ప్రివెన్షన్ ఇంపార్టెంట్ కాబట్టి... ఈ సూచన కు అందరూ మద్దతు తెలుపుతున్నారు. అయితే... దీనిపై పోలీసులు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ప్రభుత్వంతో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో ప్రస్తుతానికి పరిశీలనలో ఉంచినట్టు తెలుస్తుంది. ఏదైనా కరోనా కేసు హైదరాబాదులో నమోదు అయితే... కచ్చితంగా పోలీసులు దీనిని పరిగణలోకి తీసుకోవాల్సిన సూచన అని చెప్పొచ్చు.