Begin typing your search above and press return to search.

భారత్ లో కరోనా: 18601 కేసులు..543మంది మృతులు

By:  Tupaki Desk   |   21 April 2020 7:00 AM GMT
భారత్ లో కరోనా: 18601 కేసులు..543మంది మృతులు
X
భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రాష్ట్రాలు - కేంద్రం ఎంత పకడ్బందీగా ముందుకెళ్తున్న కేసుల తీవ్రత తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో ఇప్పటివరకు 18601 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు భారత వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 590మంది మరణించారని కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1553 పాజిటివ్ కేసులు.. 36 మరణాలు సంభవించినట్టు తెలిపింది.

ప్రధానంగా దేశంలో మహారాష్ట్ర - ఢిల్లీ - తమిళనాడు - రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. అత్యధిక మరణాలు మహారాష్ట్రలో 232 సంభవించాయి.

*తెలంగాణలో తగ్గని కరోనా తీవ్రత

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సోమవారం మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 12 - మేడ్చల్ 1 - నిజామాబాద్ లో 1 కేసులు నమోదైంది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 872కి చేరింది. మొత్తం తెలంగాణలో కరోనా కారణంగా ఇప్పటివరకు 23మంది చనిపోయారు. 186మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

*ఏపీలో పెరుగుతున్న కరోనా

ఏపీలో కరోనా తీవ్రమవుతోంది. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 722కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 25 - గుంటూరులో 20 - కర్నూలులో 16 - అనంతపురం లో 4 - కృష్ణా లో 5 - తూర్పు గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి. కర్నూలు లో అత్యధికంగా 174కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 92 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీ వ్యాప్తంగా కరోనా కారణంగా 20 మంది బాధితులు మరణించారు.

*ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24,81287కు చేరింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 1,70,436 దాటింది. అమెరికాలో కరోనా మరణాలు తగ్గాయి. అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.92 లక్షలు దాటింది. 42514మంది ఇప్పటి వరకు చనిపోయారు. 72వేల మంది కోలుకున్నారు. యూరప్ లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కో దేశంలో లక్ష దాటింది. చైనాలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది.