Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో క‌రోనా త‌గ్గుముఖం..తాజాగా 13 కేసులే!

By:  Tupaki Desk   |   24 April 2020 3:08 PM GMT
తెలంగాణ‌లో క‌రోనా త‌గ్గుముఖం..తాజాగా 13 కేసులే!
X
కరోనా వైర‌స్ వ్యాప్తి తెలంగాణ‌లో త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. ఇదే విష‌యాన్ని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించారు. కొన్ని రోజులుగా త‌క్కువ స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా శుక్ర‌వారం 13 క‌రోనా పాజిటివ్ కేసులు వ‌చ్చాయ‌ని మంత్రి ప్ర‌క‌టించారు. కేసులు త‌గ్గుతుండ‌డంపై ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ త్వరలోనే వైరస్ పూర్తిగా కట్టడిలోకి వస్తుందని ఆశాభా‌వం వ్యక్తం చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 983కి చేరుకుందని ప్ర‌క‌టించారు. అయితే క‌రోనా వైర‌స్ సోకి చికిత్స పొందిన వారు గురువారం 29 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్ల‌డించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్పటికే 262 మంది డిశ్చార్జ్ చేసినట్లు గుర్తు చేశారు. ఈ క్ర‌మంలో ప్రస్తుతం హైద‌రాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైర‌స్ బాధితులు 663 మంది చికిత్స పొందుతున్నట్లు వివ‌రించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల‌కు అనుగుణంగా తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డికి ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. మొత్తం మరణాల సంఖ్య 25కు చేరుకున్న విష‌యం తెలిసిందే.