Begin typing your search above and press return to search.
ఏపీలో కరోనా కట్టడిలోకి వచ్చినట్టేనా?
By: Tupaki Desk | 9 April 2020 10:30 AM GMTకరోనా వైరస్ .. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి విజృంభిస్తుంది. మొదట్లో ఏపీలో కేసులు తక్కువగా నమోదైనా కూడా ..ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత కరోనా పాజిటివ్ కేసులు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. ఈ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏపీ ప్రజలకి ఓ చిన్న శుభవార్త. బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు మొత్తం 12 గంటల్లో అసలు ఒక్క కరోనా పాజిటివ్ కేసులేవీ ఏపీలో నమోదు కాలేదు.
కొత్త కేసులు నమోదుకాలేదు అంటే .. తాజాగా పరీక్షించిన 217 శాంపిల్స్ లో నెగెటివ్ అని వచ్చింది. కరోనా సోకిన ప్రతి ఒక్కరినీ ఐసోలేషన్ వార్డ్ కి పరిమితం చేయడం - అనుమానాలున్న వారందరిని క్వారంటైన్ కి షిఫ్ట్ చేయడం తోటే పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చింది. అత్యథికంగా కర్నూలులో 75 - ఆ తర్వాత గుంటూరులో 49 - నెల్లూరులో 48 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 348 కేసుల్లో దాదాపు సగం కేసులు ఈ మూడు జిల్లాల్లోనే నమోదయ్యాయి
కర్నూలు - గుంటూరు - నెల్లూరు జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా పంపించిన శాంపిల్స్ లో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. దీంతో రాష్ట్ర అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఇప్పటివరకూ ఏ రాష్ట్రం కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఏపీలో 217శాంపిల్స్ లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం సంతోషించదగ్గ విషయం. దీంతో ఏపీలో కరోనా కట్టడికి తొలి అడుగు పడినట్టేనని వైద్యశాఖ అధికారులు అంటున్నారు. అయితే పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదు ప్రజలు లాక్ డౌన్ నియమాలని అతిక్రమిస్తే .. ప్రమాదమే. ఎలాగూ పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదు కాబట్టి ..అధికారులు మరింత కఠినంగా ఉంటే త్వరలోనే ఏపీ కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారుతుంది.