Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎత్తేసే ఆశలను చంపేసేలా కరోనా కేసుల పెరుగుదల!

By:  Tupaki Desk   |   8 April 2020 3:30 PM GMT
లాక్ డౌన్ ఎత్తేసే ఆశలను చంపేసేలా కరోనా కేసుల పెరుగుదల!
X
ప్రతి ఒక్కరు కేసులు ఏమైనా తగ్గుతాయా? తగ్గితే లాక్ డౌన్ ఎత్తేస్తారేమో అని ఆశగా ఇండియా అంతటా ఎదురుచూస్తుంటే... కేసులు మాత్రం ఆ ఆశలను చంపేసే స్థాయిలో పెరుగుతున్నా... సాయంత్రానికి కేంద్రం వెలువరించిన తాజా లెక్కల ప్రకారం కేసులే కాదు - మరణాలు కూడా పెరిగాయి. రికార్డు స్థాయిలో 773 కొత్త కేసులు నమోదుకాగా... 32 కొత్త మరణాలు నమోదయ్యాయి. ఇది కచ్చితంగా లాక్ డౌన్ పెరుగుదలకు దారితీసేలాగే ఉంది. ఇప్పటి వరకు నమోదైన సంఖ్యలు చూస్తే ఇదే సింగిల్ డే హయ్యెస్ట్ నెంబరు. దేశంలో మహారాష్ట్ర ఈరోజు కూడా అత్యధిక కేసులు నమోదు చేసింది. అలాగే తమిళనాడు - తెలంగాణ - హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో గత 24 గంటల్లో 49 కేసులు పెరగడంతో మొత్తం కేసుల సంఖ్య 453 కి పెరిగిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. డిశ్చార్జి కేసులు - మరణాలు తీసేయగా... ప్రస్తుతం యాక్టివ్ కేసులు తెలంగాణలో 397గా ఉన్నాయి. ఢిల్లీ మర్కజ్ మసీదు కేసుల గురించి కూడా ఈటెల మాట్లాడారు. అయితే సంపూర్ణ వివరాలు వాటి గురించి వెల్లడించలేదు. కాకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన 1100 మందికి టెస్టులు చేసినట్టు చెప్పారు. అంటే దీన్ని బట్టి... గత వారం రోజులుగా కొత్త కేసులున్నీ అవే ఉన్నట్టున్నాయి. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారితో కాంటాక్ట్ అయిన 3 వేల మంది క్వారంటైన్లో ఉన్నట్టు మంత్రి ఈటెల చెప్పారు.

ఇక ఏపీలో కేసుల పెరుగుదల జోరు నిన్నటి కంటే కాస్త ఎక్కువగా ఉంది. ఇంతవరకు తక్కువ కేసులతో చివరి స్థానంలో ఉన్న అనంతపురంలో ఈరోజు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఉదయం నుంచి 19 కేసులు నమోదు కాగా అందులో 7 కేసులు అనంతపురం జిల్లావే. గుంటూరులో మరో 8 కేసులు - ప్రకాశంలో మూడు కేసులు - పశ్చిమగోదావరిలో ఒకటి కలిపి మొత్తం ఏపీలో కేసు సంఖ్య 348 కి పెరిగింది. ఈరోజు విశాఖపట్నంలో ముగ్గురు డిశ్చార్జి అవగా... ఇంతవరకు ఈ మూడుతో కలిపి 9 మంది డిశ్చార్జి అయ్యారు.