Begin typing your search above and press return to search.
షాక్ః మాంసం అమ్మే చోటు నుంచే కరోనా విస్తరణ
By: Tupaki Desk | 13 May 2020 5:22 PM GMTఅగ్రరాజ్యం అమెరికాను కరోనా కలవరపాటుకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. దేశ పరిపాలనకు కేరాఫ్ అడ్రస్ అయిన వైట్ హౌస్ నుంచి మొదలుకొని వివిధ రాష్ట్రాల వరకూ... ప్రాంతాలతో సంబంధం లేకుండా కరోనా వ్యాప్తి జరుగుతోంది. మరోవైపు అమెరికన్లు లాక్ డౌన్ ఎత్తివేయాలని నినదిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ మేరకు విజయం సాధించారు కూడా. అయితే, అలాంటి చోట్ల షాక్ కు గురయ్యే వార్తలు తెరమీదకు వస్తున్నాయి.
అంతర్జాతీయ వార్త సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణ ప్రకారం - లాక్ డౌన్ నిబంధనలు ఎత్తి వేయించబడిన పలు రాష్ట్రాల్లో కరోనా విస్తృతి పెరుగుతోంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని, వ్యాధిగ్రస్తుల నుంచి ఉద్యోగులకు ఈ మహమ్మారి సోకుతోందని స్పష్టమైంది. ఇక షాకింగ్ విషయం ఏంటంటే...అమెరికన్లు అమితంగా ఇష్టపడే మాంసం ద్వారానే కరోనా వ్యాప్తి జరుగుతోందట. మాంసం ప్యాకింగ్ - ప్రాసెసింగ్ కేంద్రాల వద్ద నుంచి కరోనా విస్తృతి కొనసాగుతోందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
అమెరికాలోని 15 రాష్ట్రాల్లో ఇటీవల నమోదైన కేసులు దీనికి ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 28 నుంచి మే 5వ తేదీ వరకు అమెరికాలోని మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్ లు కారాగాల్లోని ప్రాంతాల్లోనే కరోనా కేసులు విస్తృతి పెరిగిన విషయం స్పష్టమైంది. దీంతో ప్రజలు మరింతగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.