Begin typing your search above and press return to search.
కరోనా అప్డేట్ : 1300 దాటిన తెలుగు రాష్ట్రాల కరోనా కేసులు!
By: Tupaki Desk | 18 April 2020 6:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ రోజుకి వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో - ఎలా అరికట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రపంచంలోని సగానికిపైగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల ప్రాణాలనే కాదు - వారి జీవనోపాధిని సైతం కరోనా చిన్నాభిన్నం చేసింది. లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు స్తంభించిపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక మన దేశంలో కూడా కరోనా రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్న కూడా కరోనా కేసులు పెరుగుతుండటం గమనార్హం.
కొత్తగా మరో 31కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 603కి చేరింది. కొత్తగా నమోదైన కేసులో 18 కేసులు కేవలం కృష్ణా జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. అలాగే , కర్నూల్ లో 5 - నెల్లూరు లో 3 - ప్రకాశం - తూ ..గో జిల్లాలో రెండు - ప.గో లో ఒక కేసు నమోదు అయ్యింది. ఇక రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 15 కు చేరింది. కరోనా తో పోరాడి ..గెలిచి డీఛార్జ్ అయినవారు 42 మంది ఉన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 546 . ఇకపోతే ఇప్పటికే ఏపీ ప్రభుత్వ కరోనా పరీక్షల కోసమా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను తెప్పించిన విషయం తెలిసిందే.
ఇటు తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం రోజు కొత్తగా మరో 66 కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర వైద్య - ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరింది. అయితే - కేవలం గురు - శుక్ర వారాల్లోనే దాదాపు 116 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 14,425 కరోనా కేసులు నమోదు కాగా ..488 మంది కరోనా భారిన పడి మృతిచెందారు. 2,045 మంది కరోనా నుండి కోలుకున్నారు.