Begin typing your search above and press return to search.

14 వేల క‌రోనా కేసులు..ఒక్క ఇంట్లోనే 26 మంది..!

By:  Tupaki Desk   |   18 April 2020 2:52 PM GMT
14 వేల క‌రోనా కేసులు..ఒక్క ఇంట్లోనే 26 మంది..!
X
దేశంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ - దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య‌ మొత్తం 14,378కి చేరుకోగా మ‌ర‌ణాల సంఖ్య 480కి చేరింద‌న్నారు. క‌రోనా వైర‌స్‌తో సంభ‌విస్తున్న మ‌ర‌ణాల రేటు 3.3 శాతంగా ఉన్న‌ట్లు ఆయ‌న వివరించారు. కాగా, తాజాగా ఒకే ఇంట్లో భారీగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది.

24 గంటల వ్యవధిలో 957 కొత్త కేసులు నమోదు కాగా - 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్ర‌తినిధి పేర్కొన్నారు. 12,289 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 3,323 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఢిల్లీ(1,707) - మధ్యప్రదేశ్‌(1,355) కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 2,015 కోలుకొని డిశ్చార్జ్‌ కాగా 488 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఢిల్లీలోని జహంగిర్‌ పురి ప్రాంతంలో ఒకే కుటుంబంలో 26మందికి కరోనా సోకడం క‌ల‌క‌లంగా మారింది. దీంతో, ఆ ప్రాంతంపై ఢిల్లీ అధికారులు సీరియ‌స్‌ గా దృష్టి సారించారు. కంటైన్‌ మెంట్ జోన్‌ గా గుర్తించి వెంట‌నే సీజ్ చేశారు.

ఇదిలాఉండ‌గా, వైర‌స్ సంక్ర‌మ‌ణ రేటు 83 శాతం ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. వ‌య‌సుల వారిగా మ‌ర‌ణాల రేటును వివ‌రించిన ల‌వ్ అగ‌ర్వాల్ 0-45 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు 14.4 శాతం - 45-60 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు 10.3 శాతం - 60-75 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు 33.1 శాతం - 75 ఏళ్ల‌కు పైబ‌డిన వారు 42.2 శాతం మ‌ర‌ణిస్తున్నార‌ని వివ‌రించారు.