Begin typing your search above and press return to search.
కరోనా దెబ్బ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం
By: Tupaki Desk | 7 March 2020 10:50 AM GMTచైనాలో పుట్టి మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు అపసోపలు పడుతున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ తో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే అంతర్జాతీయ పరిణామాలు, వివిధ దేశాల మధ్య తలెత్తిన వివాదాలు వంటి వాటితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊగిసలాడుతున్న సమయంలో కరోనా వచ్చి ఆర్థిక వ్యవస్థను నట్టేటా ముంచుతోంది. ఈ వైరస్ ప్రభావానికి ఆర్థిక కార్యకలాపాలన్నీ దెబ్బతింటున్నాయి. విమాన ప్రయాణాల మొదలుకుని, ఎగుమతులు, దిగుమతులు దాక వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులు పడుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. దీని ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్థిక మందగమనం కారణంగా ఇప్పటికే భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం ఉంది. దీంతో ఆటో, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం డిమాండ్, ఉత్పత్తి తగ్గింది. ఈ వైరస్ ప్రభావం వ్యాపార లావేదేవీలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. దీంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దిద్దుబాటు చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సమయంలో కరోనా వైరస్ దాడి చేసింది. దీని ప్రభావంతో ముఖ్యంగా భారత్ తో చైనాకు పెద్ద ఎత్తున ఎగుమతులు, దిగుమతులు ఉన్నాయి. ఆ దేశంలో ఆ వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో ఎగుమతులు, దిగుమతులు చాలా వరకు తగ్గాయి. ముడిసరుకులు, ఎలక్ట్రానిక్ తదితర వస్తువులు చైనా నుంచి దిగుమతు అవుతుంటాయి. చైనాలో వైరస్ వ్యాప్తితో ఆదేశంతో పాటు మనదేశం కూడా ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధించింది.
కరోనా ప్రభావం తో ఎగుమతులు తగ్గి వాణిజ్యం 34.8 కోట్ల డాలర్ల మేర తగ్గవచ్చునని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. ఎగుమతుల్లో చేసే ప్రధాన దేశాల్లో భారత్ కూడా ప్రధానమైంది. దీంతో ఎగుమతుల విషయంలో భారత్ ఇప్పటికే భారీగా నష్టపోయింది. చమురు ఉత్పత్తిలో రోజు 1.5 మిలియన్ బ్యారళ్ల చమురు ఉత్పత్తి కోత విధించేందుకు ఒపెక్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అంతర్జాతీయ ఉక్కు రంగం పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంర్ లో టన్నుకు దాదాపు 30 డాలర్ల మేర ధరల ఒత్తిడిని భారత కంపెనీలు ఎదుర్కోవచ్చునని పలు ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి. ఉక్కు సంస్థల నిర్వహణ మార్జిన్లపై దేశీయ ఉక్కు ధరలు ఇప్పటికే ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.
కరోనా భారత్ లో ప్రవేశించడంతో హ్యాండ్ శానిటైజర్లలో విక్రయాలు పెరిగాయి. మార్కెట్లో వీటికి కొరత ఉందనే పుకార్ల నేపథ్యం లో ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను పెంచాయి. హిమాలయ డ్రగ్, గోద్రోజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, హిందూస్థాన్ యూనీలీవర్ తదితర కంపెనీలు తమ ఉత్పత్తులు పెంచుతున్నాయి. కరోనా ప్రభావం ముఖ్యంగా విమానరంగంపై తీవ్రంగా పడింది. వైరస్ వ్యాప్తి ప్రయాణాల ద్వారా అవుతుందని గుర్తించిన ప్రజలు విమానం ఎక్కడం మానేశారు. దీంతో ప్రయాణికులు లేక విమానాలు రాకపోకలు నిలిపివేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కరోనా ప్రభావంతో రూ.8.29 లక్షల కోట్ల నష్టం విమానయాన రంగంపై పడిందని ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ ప్రభావం దేశీయంతో పాటు అంతర్జాతీయ విమానయాన రంగంపై ఇంకా తీవ్రంగా ఉంది.
దీంతో ప్రపంచ దేశాలు కోలుకోలేకపోతున్నాయి. అంతర్జాతీయ వ్యాపారం సన్నగిల్లుతోంది. ఇన్నాళ్లు వాణిజ్య యుద్ధాల తో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కరోనా ప్రభావంతో తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇప్పట్లో ఆర్థిక వ్యవస్థ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.