Begin typing your search above and press return to search.

షాకింగ్..అమెరికాలో రోజుకి 2 వేల కరోనా మృతులు!

By:  Tupaki Desk   |   10 April 2020 8:30 AM GMT
షాకింగ్..అమెరికాలో రోజుకి 2 వేల కరోనా మృతులు!
X
ఆధుణికంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా చరిత్రలో ఎన్నడు లేని విదంగా - కరోనా తో విలవిలాడుతోంది. కరోనా దెబ్బకి న్యూయార్క నగరం శవాల దిబ్బగా మారిపోయింది. ఇప్పటికే లక్షా 50 వేల కేసులు పైగా ఈ ఒక్క నగరంలో నమోదు కాగా 24 గంటల్లో ఈ నగరంలో 2 వేలమంది కరోనా రోగులు మృత్యువాత పడటం అమెరికాను కలవర పెడుతోంది. కరోనాతో అంటే గుర్తొచ్చేవి స్పెయిన్‌ - ఇటలీ. పదివేల మరణాలు తొలిగా చోటుచేసుకొన్న యూరప్‌ దేశాలివి. కానీ , ఇప్పుడు అమెరికా అల్లాడిపోతోంది.

యూరప్ లోని ఏ దేశంలోనూ ఒకే రోజు మరణాలు వెయ్యి దాటలేదు. కానీ, అమెరికాలో దాదాపు రెండు వేలమంది చొప్పున వరుసగా రెండురోజులు చనిపోవడంతో అక్కడ మరణాలు 16,697కు చేరుకొన్నాయి. దీంతో, 15,447 మరణాలు చోటుచేసుకొన్న స్పెయిన్‌ ను మించిన విషాదం అమెరికాలో అలుముకొంది. కుప్పలుతెప్పలుగా వచ్చిపడిన పాజిటివ్‌ కేసులను చూడటానికి ఆస్పత్రులు చాలడం లేదు. 24 గంటలూ పోరాడుతున్న వైద్యులకు వ్యక్తిగత రక్షణ పరికరాలను ప్రభుత్వం సరిపడా అందించ లేకపోతోంది.

కరోనా కారణంగా చనిపోయే వారిని పూడ్చడానికి న్యూయార్క్‌ - న్యూజెర్సీ లాంటి హాట్‌ స్పాట్లలో సమాధి స్థలాలు సరిపోవడం లేదు. అయితే, ప్రభుత్వం కొంత ఆలస్యంగానైనా లాక్‌ డౌన్‌ అమలు చేస్తూ - భౌతిక దూరాన్ని తప్పనిసరి చేసింది. ఇదే ఇప్పుడు అమెరికా ను కరోనా నుండి గట్టెకించాలి. ఇదే మాట న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో స్పష్టం చేశారు. ఈ చర్యల వల్లే కేసులు తగ్గుతున్నాయని, ఆస్పత్రుల్లో కొత్తగా చేరేవారు కూడా తగ్గిపోయారని ఆయన వెల్లడించారు.

న్యూయార్క్‌ వాసుల్లో లాటిన్‌ అమెరికా - ఆఫ్రికా సంతతివారే ఎక్కువగా చనిపోతున్నారని ప్రభుత్వ ప్రాథమిక నివేదిక తెలిపింది. చేతులు కలిపి కరచాలనం చేసే అలవాటును మునుముందు మానేయాలని అంటువ్యాధుల సంస్థ అధినేత ఆంటోనీ ఫౌసీ సూచించారు. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గడమే కాదు - కరోనా పెద్దఎత్తున సోకుతున్న ఘటనలూ తగ్గుముఖం పడతాయని ఆయన వివరించారు. కాగా, కరోనా విషయంలో చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెనుకేసుకువస్తున్నదంటూ మరోసారి అధ్యక్షుడు ట్రంప్‌ విరుచుకుపడ్డారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 4.50 లక్షలు దాటగా - మృతుల సంఖ్య 16 వేలకు చేరింది.