Begin typing your search above and press return to search.
భారత్ లో మోగుతున్న మృత్యుగంట..2 వేలు దాటిన కరోనా మృతులు
By: Tupaki Desk | 10 May 2020 11:02 AM GMTమూడో దశ లాక్ డౌన్ అమలవుతున్నా భారతదేశంలో కరోనా వైరస్ విజృంభణ ఎక్కడా తగ్గడం లేదు. రోజురోజుకు మహమ్మారి ప్రబలుతోంది. కొత్త కొత్త ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో భారీగా పాజిటివ్ కేసులు - మరణాల సంఖ్య నమోదవుతున్నాయి. ఆదివారంతో కరోనా కేసుల సంఖ్య 62,939కి చేరుకోగా - మృతుల సంఖ్య 2,109కి చేరింది. ఒక్క శనివారం రోజే 3,277 కేసులు నమోదవడంతోపాటు 128 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు. అయితే వైరస్ నుంచి 19,358 మంది కోలుకోగా - మిగతా 41,472 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ విధంగా దేశంలో కరోనా ప్రభంజనం సృష్టిస్తోంది. ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా ఆ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ఆ వైరస్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో భారత్ లో పరిస్థితులు అదుపు తప్పేలా ఉన్నాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో వృద్ధులు - దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్నింటిలో వైరస్ చివరి దశకు గుర్తించిన సమయంలో చికిత్స అందించేలోపే మృత్యువాత పడుతున్నారు. ఈ విధంగా కేసులు - మృతులు పెరగడంతో భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేంద్రం సడలింపులు ఇవ్వడం.. ప్రజలు కరోనా విషయమై సమాచారం ఇవ్వకపోవడం వంటివి పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
దేశంలో అత్యధిక కేసులు - మరణాలు సంభవిస్తున్నా రాష్ట్రాలు ఇవే...
మహారాష్ట్ర: మొత్తంల కేసులు 20,228 - మృతులు 779 మంది.
గుజరాత్: 7,796 పాజిటివ్ కేసులు ఉండగా 472మంది మృతి
మధ్యప్రదేశ్: 3,614 పాజిటివ్ కేసులు నమోదవగా 215 మంది మృతి చెందారు.
ఢిల్లీ: 6,542 కేసులు ఉండగా - మృతులు 73 మంది ఉన్నారు.
తమిళనాడు: కేసులు 6,535 ఉండగా - మృతులు 44 మంది
ఇక తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ - రాజస్థాన్ - పశ్చిమబెంగాల్ - పంజాబ్ - ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.