Begin typing your search above and press return to search.
ఏపీ లో కరోనా ప్రభావం ఎలా వుంది?
By: Tupaki Desk | 13 May 2020 7:26 AM GMTప్రస్తుతం మానవ జాతి మొత్తాన్ని కరోనా వణికిస్తోంది. అలాగే మన దేశంలో కూడా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 వేలు దాటినప్పటికీ పరిస్థితి జాతీయ - అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కేసులతో విశ్లేషిస్తే పరిస్థితి అదుపులో ఉంది. జాతీయ స్థాయిలో ముఖ్యంగా మహారాష్ట్ర - గుజరాత్ - తమిళనాడు - ఢల్లీ - రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పెరుగుతూనే ఉంది. దేశం మొత్తం మీద కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. మే 11 నాటికి దేశంలో 67161 కేసులు నమోదు కాగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 2018 ఉన్నాయి. ఇందులో 975 యాక్టివ్ కేసులు కాగా అంతకన్నా ఎక్కువ మంది అంటే 998 మంది పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రు నుంచి డిశ్చార్జ్ చేశారు. దేశం మొత్తం మీద నమోదవుతున్న కేసుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2.93 శాతం కోవిడ్ ప్రభావం చూపుతోంది.
దేశంలో అత్యధిక కరోనా టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్ లో - దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా కరోనా టెస్టులు నిర్వహించారు. రాష్ట్రంలో 181144 టెస్టులు నిర్వహించారు ఇందులో 1930 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్త 181144 పరీక్షలు మే 11 తేది నాటికి నిర్వహించగా అందులో 2018 పాజిటివ్గా తేలాయి. మొత్తం పాజిటివ్ రేటు శాతం 1.11 గా నమోదయ్యింది. చాలా రాష్ట్రాలతో పోలిస్తే పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తున్నందున పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని వైద్యులు - కోవిడ్ పై అధ్యయనం చేస్తున్నవారు చెబుతున్నారు. పాజిటివ్ రేట్లు దేశ వ్యాప్తంగా సరాసరి 3.9 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 1.2 శాతంతో అతితక్కువ శాతం కేసుల్లో 3 స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలు ఒరిస్సా - కర్నాటకలు ఉన్నాయి. అయితే కర్నాటకలో లక్షా 3 వేల టెస్టులు - ఒరిస్సాలో 56322 టెస్టులు నిర్వహించారు. ఆ రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ తరహా టెస్టులు నిర్వహించి ఉంటే అక్కడ కూడా పాజిటివ్ రేటు పెరిగి ఆంధ్రప్రదేశ్ తక్కువ పాజిటివ్ కేసుల రాష్ట్రంగా నమోదయ్యేదని వైద్యులు చెబుతున్నారు.
దేశ సరాసరికన్నా పంజాబ్ - పశ్చిమబెంగాల్ - మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అధికంగా ఉన్నాయి. అన్నింటకన్నా గుజారత్ (7%) - ఢల్లీ (7.8) - మహారాష్ట్ర (9%) అగ్రభాగంలో అత్యధిక కేసులతో సతమతమవుతున్నాయి. టెస్టుల నిర్వాహణలో ప్రతీ మిలీయన్ కు అత్యధికంగా నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంలో ఉంది. రాష్ట్రంలో 306.2 టెస్టులు ప్రతీ మిలీయన్ కు నిర్వహిస్తున్నారు. ఇది కేరళలో 112.4 - పశ్చిమబెంగాల్లో 39.5 - తెలంగాణలో 58.4 - గుజరాత్లో 171.7 - తమిళనాడులో 295 - రాజస్థాన్ లో 196 - పంజాబ్లో 131 - మహారాష్ట్రలో 170.7 చొప్పున ప్రతీ మిలీయన్కు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మార్చి నుంచి కేసులను పరిశీలిస్తే...
ఆంధ్రప్రదేశ్ లో పాజిటివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 20 నుంచి మే 5వ తేది వరకు పరిశీలిస్తే క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్ 20న 2.4శాతం - ఏప్రిల్ 25న 2.1శాతం నమోదయ్యాయి. ఏప్రిల్ 30వ తేదికి 1.5 శాతానికి తగ్గాక - మే 5వ తేది వచ్చేవరకు మరింత తగ్గి 1.2 శాతానికి తగ్గింది. అయితే తమిళనాడు - మహారాష్ట్ర - గుజరాత్ - పంజాబ్ - బీహార్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు భిన్నంగా పాజిటివ్ కేసుల శాతం పరీక్షల సంఖ్యతో పోలిస్తే గణనీయంగా పెరుగుతున్నాయి. దేశం మొత్తం మీద అతి ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా అతి తక్కువ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాలు - చత్తీస్ ఘడ్ - తెలంగాణ - ఝార్ఖండ్ - అస్సాం - బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపి పరిస్థితి చాలా మెరుగు…
దేశంలో మరణాల శాతాల్లోనూ ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉంది. గుజరాత్ అత్యధికంగా 6.2 శాతంతో అగ్రభాగంలోనూ, మధ్యప్రదేశ్ 5.95 శాతం రెండవ స్థానంలో - మహారాష్ట్ర 3.75 మూడో స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తక్కువ మరణాల్లో 3వ స్థానంలో ఉంది. కేరళ - తమిళనాడు - ఢల్లీ తర్వాత ఆంధ్రప్రదేశ్ 2.23 శాతంతో మూడో స్థానంలో ఉంది. దేశంలో 8 రాష్ట్రాల్లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. వాటిల్లో మహారాష్ట్ర - గుజరాత్ - రాజస్థాన్ - ఢల్లీలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. అక్కడ వరుసగా 832 - 439 - 108 - 73 చొప్పున మరణాలు చోటు చేసుకోగా ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడు కన్నా తక్కువగా అంటే 45 మంది మరణించారు. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ మరణాల్లో మధ్యప్రదేశ్ అత్యధిక శాతం నమోదు చేసుకుంది. ఇక్కడ 215 మరణించారు. కేసుల పెరుగుదల శాతం (యావరేజ్ గ్రోత్ రేటు) ప్రతీ ఏడు రోజులకు పరిశీలిస్తే చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో మెరుగ్గా ఉంది. కేరళ - బీహార్ - మధ్య ప్రదేశ్ తరువాత ఆంధ్రప్రదేశ్ తక్కువలో ఉంది. ప్రతీ ఏడు రోజులకు 3.1 శాతం కేసులు నమోదవుతున్నాయి. అయితే తమిళనాడు - పంజాబ్ - పశ్చిమబెంగాల్ - హర్యానా - ఢల్లీ - గుజరాత్ - రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది.
అత్యధిక కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానం
దేశం మొత్తం మీద మహారాష్ట్రలో 32.06 శాతంతో కేసుల సంఖ్యలో అగ్రభాగంలో ఉండగా - గుజరాత్ 12.35 శాతం, తమిళనాడు 11.57 - ఢల్లీ 10.46 శాతాలతో అగ్రభాగంలో ఉన్నాయి. తరువాత రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - ఉత్తరప్రదేశ్ స్థానాలు ఆక్రమించాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం 2.92 శాతంతో మెరగైనా స్థానంలో ఉంది. దేశంలో మార్చి 4 వ తేది నుంచి కేసుల సంఖ్య పెరగడం ప్రారంభం కాగా ఏప్రిల్ 1 తేది నుంచి మరింత పెరుగుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి మార్చి 29 నుంచి కేసులు పెరగడం ప్రారంభం కాగా అదే పరిస్థితి స్థిరంగా కొనసాగుతూ వస్తుంది. కోవిడ్ బాధితులు కోలుకోవడం దేశంలో జనవరి నుంచి ఏప్రిల్ 19 వరకు స్థిరంగా ఉండగా ఆ తరువాత మెరుగు పడుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి కోలుకునే వారి శాతం మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు స్థిరంగా ఉండగా ఆ తరువాత క్రమంగా పెరుగుతూ ఏప్రిల్ 28 నుంచి మరింత మెరుగు పడి మే 10వ తేది నాటికి గణనీయంగా వృద్ధి చెంది 925 చేరింది. మరే రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితి లేదు. లాక్ డౌన్ ప్రభావం ఏపిలో మెరుగ్గానే కనిపించింది. దేశంలో ఇప్పటికీ మూడో విడత లాక్ డౌన్ అమలవుతోంది. మొదటి విడత లాక్ డౌన్ లో కేసులు నమోదయిన రాష్ట్రాల్లో పంజాబ్ - పశ్చిమబెంగాల్ - తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉంది. రెండో విడత లాక్ డౌన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ - పశ్చిమబెంగాల్ - పంజాబ్ లతో పాటు కొనసాగింది. మూడో విడత లాక్ డౌన్ లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మూడు విడతల లాక్ డౌన్ లోనూ మహారాష్ట్ర - తమిళనాడు - గుజరాత్ - ఢల్లీ - యూపి - రాజస్థాన్ లో కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. ఇక లాక్ డౌన్ సమయంలో మరణాల విషయానికి వస్తే కూడా గుజరాత్ - మహారాష్ట్ర - మధ్యప్రదేశ్ - రాజస్థాన్ రాష్ట్రాలే అగ్రభాగంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ తక్కువతో మెరుగ్గా ఉంది.
-VSR