Begin typing your search above and press return to search.
మీడియా హౌస్ మీద కరోనా పంజా!
By: Tupaki Desk | 19 March 2020 1:30 AM GMTప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంపై కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. అలాగే పలు రకాల క్రీడా టోర్నమెంట్స్ రద్దు అయ్యాయి. తాజాగా కరోనా దెబ్బకి సీఎన్ ఎన్ ఫిలిప్పీన్స్ చానల్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. ఆ టీవీ చానల్ ఉన్న బిల్డింగ్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదుకావడంతో.. ఛానెల్ ప్రసారాలు నిలిచిపోయాయి. ఆఫీస్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో కనీసం 24 గంటల పాటు తమ ప్రసారాలు నిలిచిపోనున్నాయని ఆ చానల్ ప్రకటించింది.
అయితే వెబ్ సైట్ - సోషల్ మీడియా వేదికగా తాము వార్తలను అందిస్తామని సీఎన్ ఎన్ ఫిలిప్పీన్స్ తెలిపింది. ఈ మేరకు ఆ చానల్ సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ప్రకటన చేసింది. మా చానల్ కార్యాలయం కేంద్రీకృతమైన వరల్డ్ వైడ్ కార్పొరేట్ సెంటర్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వరల్డ్ వైడ్ కార్పొరేట్ సెంటర్ యాజమాన్యం ఆ ప్రాంతాన్ని మొత్తం ఒకసారి క్లీన్ చేయనున్నారు. ఆ బిల్డింగ్ ని క్లీన్ చేయాలి అంటే కనీసం 24 గంటల పాటు తమ ఛానెల్ ఆఫీస్ ని మూసేయాలని తెలిపారు.
ఈ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవడానికి మేము ముందు నుండే సిద్ధంగా ఉన్నాము - ఈ పరిస్థితులు రావచ్చు అని ముందే ఉహించి గత రెండు వారాల ముందు నుండే మా సిబ్బంది లో చాలా మంది ఇంటి వద్ద నుంచే వర్క్ చేసేలా చేసాము. ఇలాంటి ప్రమాదాన్ని ముందుగానే ఊహించి మేము ఆ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.97 లక్షల మందికి కరోనా సోకగా వారిలో 7,902 మంది మరణించారు. ఫిలిప్పీన్స్ లో ఇప్పటివరకు 187 మంది కరోనా బారిన పడ్డారు.