Begin typing your search above and press return to search.
అంబానీని కరోనా ఎంతలా దెబ్బేసిందంటే?
By: Tupaki Desk | 13 March 2020 5:45 AM GMTఎంత పెద్ద వ్యాపారమైనా.. మరెంత పెద్ద పారిశ్రామికవేత్త అయినా కంటికి కనిపించని వైరస్ కారణంగా ఎంత మేర నష్టపోవచ్చు. అతగాడి సంపద ఎంత ఆవిరైపోవచ్చు? అన్న ప్రశ్నను సంధిస్తే.. ఎవరికి తోచింది వారు చెప్పొచ్చు. కానీ.. ఆ మొత్తం ఎంతమాత్రం రూ.లక్ష కోట్లకు పైనే ఉంటుందని చెప్పే అవకాశం ఉండదు. కలలో కూడా ఊహించని భారీ మొత్తాన్ని భారత కుబేరుడు.. ప్రపంచంలోనే టాప్ టెన్ సంపన్నుల్లో ఒకడైన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నష్టపోయారు.
గడిచిన కొద్దిరోజులుగా మార్కెట్లలో చోటు చేసుకుంటున్న మహాపతనం కారణంగా ముఖేశ్ అంబానీ భారీ ఎత్తున నష్టపోయారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో.. ఆ మాటకు వస్తే కొన్ని వేల మంది కొన్ని జన్మల్లో సంపాదించలేని మొత్తాన్ని ముఖేశ్ అంబానీ ఒక్కరోజులోనే నష్టపోయారు. గురువారం మార్కెట్లలో జరిగిన భారీ క్రాష్ తో ఆయన వ్యక్తిగత సంపద ఏకంగా రూ.40వేల కోట్ల మేర ఆవిరైంది.
గడిచిన 70 రోజుల్లో కరోనా కారణంగా అంబానీ వద్దనున్న షేర్ల విలువ భారీగా పడిపోయాయి. దీంతో ఆయన సంపద ఏకంగా రూ.1.11 లక్షల కోట్ల మేర కరిగిపోయింది.
ఇదొక్కటి చాలు కరోనా వైరస్ చూపించిన ప్రభావం ఎంతన్నది అందరికి అర్థమయ్యేలా చేస్తుందని చెప్పాలి. ఏదైనా ఒక సినిమాలో హీరో రేంజ్ చెప్పేందుకు లక్ష కోట్ల అసామి అన్నంతనే.. అతగాడి ఇమేజ్ వెండితెర మీద వెలిగిపోతుంది. అలాంటిది..అంబానీ మాష్టారి ఆస్తి రెండున్నర నెలల వ్యవధిలో ఏకంగా రూ.లక్ష కోట్లకు పైనే (1.11 లక్షల కోట్లు) ఆవిరైందంటే.. ఆయనకు జరిగిన నష్టం ఎంతన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.