Begin typing your search above and press return to search.
పేపర్ల మనుగడ మీద దెబ్బేసిన కరోనా?
By: Tupaki Desk | 24 March 2020 1:30 AM GMTడిజిటల్ మీడియా అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. ప్రింట్ మీడియా పరిస్థితి మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. విపరీతమైన ఖర్చుతో కూడుకున్న ప్రింట్ మీడియా.. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో మనగలుగుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. పాఠకులకు ఉండే అభిరుచులు.. ఆసక్తులతోపాటు.. మిగిలిన మీడియంలతో పోలిస్తే.. ప్రింట్ మీడియాలో వచ్చే సమచారం విశ్వసనీయతతో పాటు.. లోతైన విశ్లేషణలు ఉన్న పరిస్థితి. అరచేతిలో ఇమిడే సెల్ ఫోన్ పుణ్యమా అని.. సమస్త ప్రపంచాన్ని అందులోనే చూసే ధోరణి అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పేపర్ ను చదివే ఆసక్తి.. అలవాటు అంతకంతకూ తగ్గుతుందన్న నివేదికలు ప్రింట్ మీడియా సంస్థల్ని వణికిస్తున్నాయి.
ఏది ఏమైనా.. మరో పదేళ్ల వరకూ తమకు ఢోకా లేదన్న ధీమాను ఈ మీడియా సంస్థలు వ్యక్తం చేసేవి.ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. మన దేశంలో.. అందునా రెండు తెలుగు రాష్ట్రాల్లో 2030 వరకూ పెద్ద ఇబ్బంది ఉండదన్న మాట వినిపించేది. అంతకంతకూ పెరుగుతున్న డిజిటల్ మీడియం మీద ఆసక్తి నేపథ్యంలో ప్రింట్ మీడియాకువస్తే ప్రకటనల షేర్ అంతకంతకూ తగ్గిపోతోంది. దీంతో.. పేపర్ ను ప్రొడ్యూస్ చేయటం కష్టతరంగా మారింది. నిత్యం పేపర్ ను తీసుకురావటం ఖర్చుతో కూడుకున్న ప్రక్రియతో పాటు.. వివిధ దశల్లో పెరిగి కాస్ట్.. తగ్గిన ఆదాయాలతో మీడియా సంస్థలు కిందామీదా పడుతున్నాయి.
ఈ కారణంతోనే గతంలో ప్రధాన సంచికను 24 పేజీల వరకూ ఇచ్చి.. తర్వాత 20కు తగ్గించటం.. కొద్దిరోజులకే 18పేజీలు..ఆ తర్వాత 16పేజీలుకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కొద్ది నెలలుగా 12.. 14 పేజీలకు మాత్రమే పరిమితమవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి కాస్తా కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు దినపత్రిక మరింత పలుచనైంది. మొన్నిటిదాకా పద్నాలుగు పేజీలు ఇచ్చిన ప్రధాన మీడియా సంస్థలు పన్నెండుపేజీలకు పరిమితమైతే.. పన్నెండు పేజీలు ఇచ్చే మీడియా సంస్థలు పది పేజలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పెద్ద పేపరే (ప్రధాన సంచిక) కాదు.. దానికి అనుబంధంగా ఇచ్చే టాబ్లాయిడ్ లోనూ అలాంటి పరిస్థితే. మొన్నటివరకూ 24 పేజీలు ఇచ్చే మీడియా సంస్థలు కరోనా కారణంగా 16 పేజీలకు తగ్గించేశాయి. ఇంటికి వచ్చే పేపర్ తో కరోనా వైరస్ ఇంట్లోకి వస్తుందన్న భయం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేపర్లను సప్లై కోసం బయటకు వస్తే.. మాకు మాత్రం వైరస్ సోకకుండా ఉంటుందా? అన్న ఆందోళనలు ప్రింట్ మీడియా సంస్థలకు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టాయి. ఓవైపు ప్రకటనల ఆదాయం.. మరోవైపు సర్య్కులేషన్ ఫిగర్లు కుంచించుకుపోవటంతో.. దినపత్రికల్లో పేజీల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్న పరిస్థితి. కరోనాతో వచ్చి పడిన ఈ కొత్త సవాలును మీడియా సంస్థలు ఎలా ఎదుర్కొంటాయన్నది ఇప్పుడో ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.